
క్రైమ్ మిర్రర్ సిటి డెస్క్ :
న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ ముస్తాబవుతోంది. కొత్త సంవత్సరానికి వెల్ కమ్ పలుకుతూ ఫుల్ జోష్ తో సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.కరోనా కారణంగా రెండేళ్లు వేడుకలకు దూరంగా ఉన్నా.. ఈ సారి మాత్రం పూర్తి స్థాయిలో జరగనున్నాయి. ఇక ఈ ఏడాది డిసెంబర్ 31 శనివారం రావడంతో వీకెండ్ కూడా కలిసి రావడంతో ఇక సెలబ్రేషన్స్ పీక్స్ కు చేరనున్నాయి. ప్రత్యేకంగా ఈవెంట్స్ ఏర్పాటు చేస్తున్నారు.
Read More : భారత్ లో త్వరలో హైడ్రోజన్ రైలు వచ్చేస్తుందోచ్ ! –
ఇక మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. డిసెంబర్ 31వ తారీఖున అర్ధరాత్రి ఒంటి గంట వరకు లిక్కర్ అమ్మకాలకు ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చింది. రిటైల్ షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు , 2బీ లైసెన్స్ ఉన్న బార్లలో అయితే రాత్రి ఒంటి గంట వరకు లిక్కర్ అమ్మకాలు జరుపుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. అయితే పబ్స్, బార్లలో మైనర్లను అనుమతించవద్దని ఆదేశాలు కూడా జారీ చేసింది.
More Read : రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలో తెలుసా? అచ్చు అలానే ఉండాలట –
ఇక న్యూ ఇయర్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు నిబంధనలు విధించారు. త్రీ స్టార్, హోటల్స్, పబ్బులు, క్లబ్బుల వద్ద ఎంట్రీ, ఎగ్జిట్ ద్వారాల వద్ద, పార్కింగ్ ప్రదేశాలలోనూ తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అశ్లీల డ్యాన్సులు, న్యూసెన్స్ లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. అలాగే సెలబ్రేషన్స్ లో శబ్ద తీవ్రత 45 డెసిబెల్స్ మించకూడదని షరతు విధించారు. పరిమితికి మించి పాస్ లు, టికెట్లు జారీ చేయొద్దని స్పష్టం చేశారు. ఇక పబ్బులు, బార్లలో మైనర్లకు అనుమతి ఇవ్వొద్దని పోలీసులు నిబంధనలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి …
-
బాలిక పట్ల జనసేన నేత వికృత చేష్టలు..రూమ్ కి రా అంటూ వాట్సాప్ సందేశాలు –
-
80 కుటుంబాల సాంఘీక బహిష్కరణ..లబోదిబోమంటున్న బాధితులు –
-
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు జడ్జిమెంట్ కాపీ.. సీఎంకు ఎలా చేరాయి?..ఆధారాలు బహిర్గతం చేయడంపై అసహనం.. –
-
పెళ్లి వార్తలపై స్పందించిన యాంకర్ ప్రదీప్ –
-
చైనాలో కరోనా విలయతాండవం.. భారత్ జనరిక్ మందులే దిక్కు అంటున్న చైనా ! –
4 Comments