
క్రైమ్ మిర్రర్ సినిమా డెస్క్:
స్మాల్ స్క్రీన్ పై సందడి చేసే యాంకర్లలో ముందు వరుసలో ఉండేది సుమ. మేల్, ఫీమేల్ అని లేదు.. అక్కడా ఇక్కడా సుమదే అగ్రస్థానం. ఆమె మాట్లాడటం స్టార్ట్ చేస్తే చమత్కారాలు, కామెడీలు, చెప్పలేనంత ఎంటర్ టైన్ మెంట్ పక్కా. టాక్ షోలు, ఈవెంట్స్, గేమ్ షోలతో అలరించడంలో ఆమెకు ఆమే సాటి. స్వతహాగా మళయాళీ అయిన సుమ తెలుగులో అనర్గళంగా మాట్లాడుతుంది.
Read More : తెలంగాణ రైతులకు శుభవార్త.. ఈ రోజు నుంచి రైతు బంధు నగదు జమ –
అందమైన గొంతుతో అందమైన భాషలో స్పాంటేనియస్ గా ఆమె మాట్లాడుతుంటే వింటూనే ఉండాలనిపిస్తుంది.తోటి యాంకర్ల నుంచి నటీనటుల వరకు సుమకు ఫ్యాన్స్ ఉన్నారంటే ఆమె క్రేజ్ ఎలాంటిదో ఊహించుకోవచ్చు. సుమ కెరీర్ స్టార్టింగ్ లో సీరియల్స్ లో నటించింది. ఆ తర్వాత సినిమాలో హీరోయిన్ గా.. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో అలరించింది. ప్రస్తుతం బుల్లితెరపై నెంబర్ వన్ యాంకర్ గా రాణిస్తోంది.అయితే తాజాగా ఆమె సంచలన నిర్ణయం తీసుకుంది.
More Read : బూస్టర్ డోస్ గా కోవిడ్ నాజల్ వ్యాక్సిన్.. ధర ఎంతో తెలుసా? –
తాజాగా జరిగిన ఓ షోలో సుమ మాట్లాడుతూ.. తాను యాంకరింగ్ కు బ్రేక్ ఇస్తున్నట్లు చెప్పి అభిమానులకు షాకిచ్చింది. బుల్లితెర నుంచి కొన్నాళ్లు బ్రేక్ తీసుకుంటున్నానని చెప్పి కన్నీటిపర్యంతమైంది. తాను మళయాళీని అయినా తెలుగు ప్రేక్షకులు ఆదరించడం పట్ల ఎమోషనల్ అయ్యారు. ఆర్టిస్టులు తనకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి …
2 Comments