
క్రైమ్ మిర్రర్ తెలంగాణ డెస్క్:
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రోజు నుంచి రైతు బంధు నిధులు జమ అవుతాయని శుభవార్త అందించింది. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. పదో విడత రైతుబంధు రూ.7676.61 కోట్లు రైతుల ఖాతాల్లో జమకానున్నాయి. అర్హులయిన 70.54 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ రోజు నుండి ఎకరానికి రూ.5 వేలు చొప్పున జమవుతాయి.
Read More : 18 పేజెస్ సినిమాలో బ్రహ్మాజీకి అవమానం జరిగిందా? –
కోటి 53 లక్షల 53 వేల ఎకరాలకు యాసంగి రైతుబంధు అందించనుంది. మొత్తం పదో విడతతో రూ.65,559.28 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నట్లు చెబుతున్నారు. గత వానాకాలం 65 లక్షల మంది అర్హులయిన రైతులకు రూ.7434.67 కోట్లు రైతుబంధు నిధులు అందజేశారు. అన్నం పెట్టే అన్నదాత యాచించే స్థితిలో కాదు శాసించే స్థానంలో ఉండాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని మంత్రి నిరంజన్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు.
More Read : బూస్టర్ డోస్ గా కోవిడ్ నాజల్ వ్యాక్సిన్.. ధర ఎంతో తెలుసా? –
రైతు కేంద్రంగా పాలన సాగుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. తెలంగాణ పథకాలు దేశమంతా అమలు చేయాలని రైతులు నినదిస్తున్నారని అన్నారు. రైతుబంధు, రైతుభీమా, సాగుకు ఉచిత కరంటు, సాగు నీళ్లు రైతుల హక్కు అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి కేంద్రంపై ఫైరయ్యారు. దేశాన్ని పాలిస్తున్న పాలకులకు రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. అబద్దపు హామీలతో గద్దెనెక్కిన నరేంద్రమోడీ ఎనిమిదన్నరేళ్లయినా ఒక స్పష్టమయిన వ్యవసాయ విధానాన్ని రూపొందించ లేకపోయారని విమర్శించారు.
Read More : అన్ స్టాపబుల్ షూటింగ్ లో పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్ కు స్వయంగా స్వాగతం పలికిన బాలకృష్ణ –
ఉపాధిహామీకి వ్యవసాయం అనుసంధానం, 60 ఏళ్లు నిండిన రైతులకు ఫించను, పంటలకు మద్దతు ధరల విషయంలో స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలు, 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు వంటి హామీల విషయంలో దేశ రైతాంగాన్ని దారుణంగా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల విషయంలో పాలకుల దృక్పధం మారాలని నిరంజన్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు.
ఇవి కూడా చదవండి …
-
రాష్ట్రపతి గారూ.. నాకు న్యాయం చేయండి – పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత కోడలు విన్నపం ! –
-
రకుల్‌ప్రీత్‌కు పెళ్లంట –
-
చైనాలో దారుణమైన పరిస్థితులు.. శ్మశానాల ముందు డెడ్ బాడీలతో పెద్ద క్యూ లైన్లు –
-
తాత అయ్యాడని 300 కిలోల బంగారం దానం చేస్తాడట..ఎవరో తెలుసా? –
-
రాష్ట్ర రైతులకు మరో శుభవార్త… న్యూ ఇయర్ గిఫ్ట్ కింద రూ. లక్ష వరకు రుణ మాఫీ చేయనున్న కేసీఆర్ –
3 Comments