
క్రైమ్ మిర్రర్ ఆన్లైన్ డెస్క్ :
చైనాలో కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. వేలాది మందికి కరోనా సోకింది. ఏ నగరంలో చూసినా కరోనా సోకిన రోగులే కనిపిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా పేషెంట్ల కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తున్నారు. కరోనా కు సంబంధించి నివ్వెరపరచే కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటివరకు ఒక్క బీఎఫ్ 7 వేరియంట్ మాత్రమే యాక్టివ్ గా ఉన్నట్లు అందరూ అనుకున్నారు. అయితే బీఎఫ్ 7 తో పాటు మరో మూడు వేరియంట్లు కూడా క్రియాశీలకంగా ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు.
Read More : బ్రేకింగ్..నార్సింగిలో డిటోనేటర్ పేలుడు..ముగ్గురికి తీవ్ర గాయాలు –
బీఎఫ్.7 వేరియంట్ కేసులు కేవలం 15శాతం మాత్రమే నమోదువుతున్నాయి. 15 శాతం కేసులు బీఎన్, బీక్యూ వేరియంట్ ద్వారా వ్యాపిస్తున్నాయి. ఎస్ వీవీ వేరియంట్ ద్వారా మరో 15 శాతం కోవిడ్ కేసులు నమోదువుతున్నాయి. దీంతో కొవిడ్ రోగుల్లో భిన్నమైన లక్షణాలు కనిపిస్తున్నాయి. కోవిడ్ లక్షణాలు కనిపించగానే జీవో కోవిడ్ నిబంధనలను చైనా అమల్లో పెట్టింది. అయితే జీవో కోవిడ్ నిబంధనలకు వ్యతిరేకంగా చైనాలో పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగింది. ప్రజలు వీథుల్లోకి వచ్చిన ఆందోళనా కార్యక్రమాలు చేపట్టారు.
More Read : తెలంగాణ రైతులకు శుభవార్త.. ఈ రోజు నుంచి రైతు బంధు నగదు జమ –
ఒక దశలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పదవి నుంచి దిగిపోవాలని నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రజాభిప్రాయానికి తలొగ్గి చైనా ప్రభుత్వం జీవో కోవిడ్ నిబంధనలను అటకెక్కించింది. దీంతో కోవిడ్ కేసులు ఒక్కసారిగా పెరిగినట్లు అధికారుల కథనం. అనేక ఆస్పత్రుల్లో కరోనా పేషెంట్ల కోసం బెడ్లు లేవు. దీంతో నేలమీదనే రోగులు నిద్రించాల్సిన దారుణ పరిస్థితులు నెలకొన్నాయి.
Read More : 80 కుటుంబాల సాంఘీక బహిష్కరణ..లబోదిబోమంటున్న బాధితులు –
ప్రస్తుతం శ్మశానాలకు ప్రతి రోజూ 200 మృతదేహాలు వస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా చైనా జనాభాలో 60 శాతం కోవిడ్ బాధితులు ఉంటారన్నది ఒక అంచనా. ఇదిలా ఉంటే కరోనాను దీటుగా ఎదుర్కోవడానికి చైనాలో మందుల కొరత కూడా ఉంది. చాలా ఆస్పత్రుల్లో పేషెంట్ల సంఖ్య కు అనుగుణంగా మందులు అందుబాటులో లేవు.
ఇవి కూడా చదవండి …
-
అన్ స్టాపబుల్ షూటింగ్ లో పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్ కు స్వయంగా స్వాగతం పలికిన బాలకృష్ణ –
-
రకుల్‌ప్రీత్‌కు పెళ్లంట –
-
యాంకరింగ్ కు దూరమవుతున్న మళయాళీ సుమ.. కన్నీళ్లు ఆగలేదు –
-
బూస్టర్ డోస్ గా కోవిడ్ నాజల్ వ్యాక్సిన్.. ధర ఎంతో తెలుసా? –
-
బ్రేకింగ్..నార్సింగిలో డిటోనేటర్ పేలుడు..ముగ్గురికి తీవ్ర గాయాలు –
3 Comments