
క్రైమ్ మిర్రర్ సిటీ బ్యూరో డెస్క్: తెలంగాణ రైతులకు ఇప్పటికే రైతు బంధు నిధుల విడుదలపై సమాచారమిచ్చిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. రైతులకు మరో శుభవార్త చెప్పేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ తీపి కబురు ఏమిటంటే.. రైతులకు రుణ మాఫీ చేయబోతున్నారట. కొత్త సంవత్సరంలో రైతులకు రూ. లక్ష వరకు రుణ మాఫీ చేయబోతున్నారని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ నేతల మాట. 2018 డిసెంబరులో రైతులకు రూ. లక్ష వరకు రుణ మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
Read More : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన తీర్పు.. సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ –
అయితే, ఈ రుణ మాఫీని పలు దఫాలుగా అందించాలని 2021 ఆగస్టులో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయించారు. మొత్తం 36.8 లక్షల మంది రైతుల రుణ మాఫీ కోసం ఏకంగా రూ. 25వేల కోట్లు అవసరమవుతాయని ఆ మంత్రి వర్గ భేటీలో అంచనా వేశారు. ఇంత మొత్తాన్ని ఒకేసారి అందజేయడం కష్టమనీ, అందుకే ఏడాదికి ఇంత అన్నట్టుగా.. అంటే 2020లో మొదటి దశలో భాగంగా రూ. 25వేలు, 2021లో రెండో విడత కింద రూ. 50వేలు, ఆపై రెండు దఫాల్లో రూ. 75వేలు, రూ. లక్ష వరకు రుణ మాఫీ చేయాలని సీఎం భావించారు.
More Read : తాత అయ్యాడని 300 కిలోల బంగారం దానం చేస్తాడట..ఎవరో తెలుసా? –
ఇది అర్హులైన వారందరికీ అందలేదని గతేడాది రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది రైతులు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే 2018 నుంచి పెండింగ్‌లో ఉన్న రుణ మాఫీని రైతులకు కొత్త సంవత్సరం కానుకగా ఈసారైనా అందజేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. గతంలో రూ. 50వేల వరకు రుణమాఫీ జరిగిన లబ్దిదారులకు నగదు రూపంలో అందజేయగా.. ఈసారి ఆ రుణ మాఫీని చెక్కుల కింద ఇవ్వనున్నట్టు సమాచారం.
Read More : సుశాంత్ సింగ్ డెడ్ బాడీపై గాయాలు.. ఆయనది హత్యే.. పోస్టుమార్టం సిబ్బంది వ్యాఖ్యలు వైరల్ –
దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. కాగా, ఈ రుణమాఫీలో ఒకే కుటుంబం నుంచి ఒకరి కంటే ఎక్కువ లబ్దిదారులు ఉన్నా, ఎక్కువ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారిని గుర్తించి వారిని ఈ రుణమాఫీ లబ్దిదారుల జాబితా నుంచి తొలగిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక కుటుంబం..ఒక లబ్దిదారుడు అన్న నిబంధన కింద పై నిర్ణయం తీసుకున్నారు. ఏదేమైనా ఈనెల 28 నుంచి రైతుబంధు నిధులు విడుదలవనుండగా.. ఆ వెంటనే రుణ మాఫీ కూడా అమలు చేస్తుండడంపై రాష్ట్ర రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి …
-
భారత వంటలు సూపర్.. అట్లాస్ అవార్డ్స్ లో మన స్థానం ఎంతో తెలుసా? –
-
చైనాలో దారుణమైన పరిస్థితులు.. శ్మశానాల ముందు డెడ్ బాడీలతో పెద్ద క్యూ లైన్లు –
-
దేశం కోసం చేతులు కలపాలి.. రాజకీయ పార్టీలు ఏకం కావాలి-రాహుల్ యాత్రలో కమల్ హాసన్ –
-
దొంగలను పట్టించిన భూతద్దం – హైదరాబాద్‌లో వజ్రాభరణాల చోరీ కేసు
-
చేర్యాల జెడ్పీటీసీపై గొడ్డళ్లు, కత్తులతో దాడి.. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో మల్లేశం మృతి..విచారణకు ఆదేశం –
4 Comments