
క్రైమ్ మిర్రర్ ఆన్లైన్ డెస్క్ : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ విచారణకు హాజరు కాకపోవడంపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఈడీ విచారణను సవాల్ చేస్తూ తాను హైకోర్టులో పిటీషన్ వేసిన కారణంగా ఇవాళ విచారణకు రావడం లేదని ఈడీ అధికారులకు మెయిల్ పంపినట్టు తెలిపారు. తాను వేసిన పిటిషన్ బుధవారం హైకోర్టులో విచారణకు వస్తుందని చెప్పారు.ఒక వేళ ఈడీ నేరుగా హాజరు కావాలన్నా హాజరు అవుతానని తెలిపారు.
Read More : రకుల్‌ప్రీత్‌కు పెళ్లంట –
అసలు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీకి సంబంధం ఏంటని ప్రశ్నించారు. తనను ఇబ్బంది పెట్టడానికే ఈడీ విచారణ పేరుతో వేధిస్తోందని ఆరోపించారు. ఈడీ విచారణపై లాయర్లతో చర్చిస్తున్నానని.. అడ్వకేట్ల సలహా మేరకు ముందుకు వెళ్తానని తెలిపారు. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఫిర్యాదుదారుడుగా ఉన్న తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని ఈడీ అధికారులు రెండు సార్లు విచారించారు. నందకుమార్ నుంచి సేకరించిన సమాచారంతో మంగళవారం ఉదయం 11 గంటలకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది.
More Read : రాష్ట్రపతి గారూ.. నాకు న్యాయం చేయండి – పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత కోడలు విన్నపం ! –
ఇప్పటికి రెండు సార్లు హాజరైన రోహిత్ రెడ్డి మంగళవారం ఈడీ విచారణకు గైర్హజరయ్యారు. హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినందున తాను విచారణకు రావడం లేదని మెయిల్ పంపారు. రోహిత్ రెడ్డి వేసిన పిటిషన్ పై బుధవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. హైకోర్టు తీర్పు వచ్చాకే తదుపరి విచారణపై నిర్ణయం తీసుకుంటానని రోహిత్ రెడ్డి అంటున్నాడు.ఇక ఎమ్మెల్యే గైర్హాజరుతో ఈడీ తదుపరి చర్యలకు సిద్ధమవుతోంది.
ఇవి కూడా చదవండి …
-
భారత వంటలు సూపర్.. అట్లాస్ అవార్డ్స్ లో మన స్థానం ఎంతో తెలుసా? –
-
చైనాలో దారుణమైన పరిస్థితులు.. శ్మశానాల ముందు డెడ్ బాడీలతో పెద్ద క్యూ లైన్లు –
-
చేర్యాల జెడ్పీటీసీపై గొడ్డళ్లు, కత్తులతో దాడి.. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో మల్లేశం మృతి..విచారణకు ఆదేశం –
-
తాత అయ్యాడని 300 కిలోల బంగారం దానం చేస్తాడట..ఎవరో తెలుసా? –
-
రాష్ట్ర రైతులకు మరో శుభవార్త… న్యూ ఇయర్ గిఫ్ట్ కింద రూ. లక్ష వరకు రుణ మాఫీ చేయనున్న కేసీఆర్ –
2 Comments