
క్రైమ్ మిర్రర్ సినిమా డెస్క్ :
తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ముగిసి ఒక రోజు గడవకముందే మరో నటుడు మృతి చెందడం టాలీవుడ్ లో విషాదం నింపింది. సీనియర్ నటుడు చలపపతిరావు కన్నుమూశారు. హైదరాబాద్ లోని కొడుకు రవిబాబు ఇంట్లోనే ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. చలపతిరావు మృతికి సినీ ప్రముఖుల సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read More : వైద్యుల పొరపాటుతో యువకుడి మర్మాంగం తొలగింపు.. పరిహారం చెల్లించిన ఆస్పత్రి యాజమాన్యం –
విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నటుడిగా ఆయన 1200కు పైగా సినిమాల్లో నటించారు. ఆయన వయసు 78 ఏళ్లు. చలపతిరావుకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొడుకు రవిబాబు కూడా సినిమాల్లో రాణిస్తున్నారు. రవిబాబు యాక్టర్ గా, దర్శకుడిగా వెండితెరపై మెరుస్తున్నాడు. కూతుళ్లు అమెరికాలో ఉంటున్నారు.
More Read : ఈ ఏడాదిలో నేరాలు 19 శాతం పెరిగాయి.. 2022 వార్షిక నివేదిక విడుదల –
అమెరికా నుంచి కూతుళ్లు రాగానే చలపతిరావు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు రవిబాబు ఇంట్లోనే అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఉంచనున్నారు. తర్వాత మహాప్రస్థానంలోని ఫ్రీజర్ లో ఉంచి బుధవారం అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
ఇవి కూడా చదవండి …
-
దేశం కోసం చేతులు కలపాలి.. రాజకీయ పార్టీలు ఏకం కావాలి-రాహుల్ యాత్రలో కమల్ హాసన్ –
-
జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ రసాభాస.. బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్ల ఆందోళన.. నిరసనల మధ్యే బడ్జెట్‌కు ఆమోదం –
-
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికిన తమిళిసై.. శ్రీశైలం మల్లన్నను దర్శించుకోనున్న ముర్ము –
-
దొంగలను పట్టించిన భూతద్దం – హైదరాబాద్‌లో వజ్రాభరణాల చోరీ కేసు
-
నటి తునిషా ది హత్యా?..ఆత్మహత్యా?.. పోలీసుల ఎఫ్‌ఐఆర్ లో ఏముంది? –
2 Comments