
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్: హైదరాబాద్ శివారులో పట్టుబడిన నకిలీ మద్యం కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. హయత్ నగర్ పోలీసులు యదాద్రి జిల్లా దేవులమ్మ నాగరం లో బయటపడ్డ నకిలీ మద్యంతో తీగ లాగితే డొంక కదిలింది. లిక్కర్ డాన్ బాలగౌడ్ సాగిస్తున్న ఈ దందా వెనుక చాలా మంది వ్యక్తులు ఉన్నారని పోలీసులు గుర్తించారు. ఒడిశా రాష్ట్రంలోని కటక్ లో తయారైన అక్రమ మద్యాన్ని తరలించి.. హైదరాబాద్ శివారుతో పాటు భువనగిరి, నల్గొండ జిల్లాల్లోని వైన్ షాపులకు విక్రయించినట్లు నిందితులు చెప్పారని తెలుస్తోంది.
Read More : ఎమ్మెల్యే మాధవరంను కలిసిన బీఆర్ఎస్ యూత్ నేతలు –
ఆగస్టు నుంచి మునుగోడు నియోజకవర్గంలో నకిలీ మద్యం సరఫరా చేశామని.. ఉప ఎన్నికలో తెలంగాణ బ్రాండ్ పేరుతో విక్రయించినట్లు నిందుతులు వెల్లడించారని పోలీసులు చెబుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో ఓటర్లకు పంపించి నకిలీ మద్యమేనని పోలీసులు గుర్తించారు.ఒడిషా వెళ్లిన హయత్ నగర్ పోలీసులు.. అక్కడి నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని సీజ్ చేశారు. ప్లాంట్ ని ధ్వంసం చేశారు. ఒడిషాలో తయారైన నకిలీ మద్యాన్ని ఎస్వీ గ్రూపు వైన్స్ ల ద్వారా అమ్మినట్లు పోలీసులు గుర్తించారు.
ఇవి కూడా చదవండి …
-
కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు చక్కదిద్దే పనిలో దిగ్విజయ్ సింగ్.. నేతలతో వన్ టూ వన్ మీటింగ్ –
-
కావాలని కరోనా అంటించుకున్న చైనా సింగర్ –
-
న్యూ ఇయర్‌లో బైక్‌లు, కార్లు కొంటున్నారా! –
-
భారత్ లో ప్రవేశించిన మరో కరోనా వేరియంట్.. బీఎఫ్.7 లక్షణాలు ఏంటి?
-
నిజం నిప్పులాంటిది చెల్లెమ్మా.. నువ్వు జైలుకెళ్లడం ఖాయం-కవితకు రాజగోపాల్ రెడ్డి కౌంటర్ –
7 Comments