
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ : ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ప్రయాణికులకు బంపరాఫర్ ప్రకటించింది. కొత్త సంవత్సరం వేళ తక్కువ ధరకే విమాన టికెట్లు ప్రకటించింది. మొత్తం మూడు రోజుల పాటు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై తక్కువ ధరకే టికెట్లు అందించాలని ఇండిగో నిర్ణయించింది.
Read More : మహబూబ్ నగర్ లో వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి… హరీశ్ రావు శంకుస్థాపన –
కొత్త సంవత్సరం వేళ ఆఫర్లు ప్రకటించింది. నేటి నుంచి డిసెంబర్ 25 వరకు అంటే మూడు రోజుల పాటు టికెట్లు కొనుగోలు చేయవచ్చు. దేశీయ ప్రయాణానికైతే రూ.2023, అంతర్జాతీయ ప్రయాణాలకు రూ.4999 కే టికెట్ ధరను అందుబాటులో ఉంచింది. 2023 జనవరి 15 నుంచి ఏప్రిల్ 14 మధ్య ప్రయాణానికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. టికెట్లు అందుబాటులో ఉన్నంతవరకు ఈ ఆఫర్ వర్తిస్తుందని ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఆఫర్ ఇతర ఆఫర్ తో కానీ, ప్రమోషన్ తో కానీ , స్కీమ్ తో కానీ కలిపి వర్తించదు. ఇండిగో గ్రూప్ బుకింగ్స్ కూడా వర్తించదు.
More Read : లోయలో పడ్డ ఆర్మీ ట్రక్కు… చనిపోయిన 16 మంది జవాన్లు –
ఒక్క హెచ్ ఎస్ బీసీ కస్టమర్లకు మాత్రం క్యాష్ బ్యాక్ పొందే అవకాశం మాత్రం ఉంటుంది. విమానయాన రంగం పుంజుకోవడంతో దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆఫర్ తో ముందుకొచ్చింది ఇండిగో సంస్థ. కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ ఆఫర్లపై ఎక్కువ మంది ప్రయాణికులు ఆసక్తి చూపే అవకాశం ఉంది. అందుకే ఈ వింటర్ సీజన్ లో ఇండిగో సంస్థ ఈ ఆఫర్ తో ముందుకొచ్చింది.
ఇవి కూడా చదవండి …
- పిట్టల్లా రాలుతున్న మునుగోడు జనాలు.. ఆగస్టు నుంచి అమ్మింది నకిలీ మద్యమే! –
-
క్రికెట్ బ్యాట్ పట్టిన నాయకురాలు సీతక్క –
- గోషామహల్ లో కుంగిన నాలా.. దుకాణాలు, వాహనాలు ధ్వంసం..భయాందోళనలో స్థానికులు –
-
ఆస్పత్రి కప్ బోర్డ్ లో ఓ మృతదేహం.. మంచం కింద మరో డెడ్ బాడీ.. అసలేం జరిగింది? –
-
ఒక్కడికే రూ. 18.50 కోట్లు – ఐపీఎల్ వేలంలో ఇంగ్లండ్ క్రికెటర్ సామ్ కర్రాన్‌కు రికార్డు ధర –
One Comment