
క్రైమ్ మిర్రర్ నేషనల్ డెస్క్: కథ మళ్లీ మొదటికొచ్చింది. చైనాలో ప్రతిరోజూ వేలసంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగుచూస్తుండడం, దక్షిణ కొరియా, అమెరికా, బ్రెజిల్, జపాన్‌లాంటి దేశాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడంతో భారత్ అప్రమత్తమైంది. విశ్వవ్యాప్తంగా కొవిడ్ కేసుల తీవ్రత ద్రుష్య్టా కేంద్ర ప్రభుత్వం మంగళవారం కొన్ని గైడ్‌లైన్స్ (మార్గదర్శకాలు) జారీ చేసింది.
Read More : ఎంపీ ధర్మపురి అరవింద్ కు త్వరలో “వై” కేటగిరీ భద్రత –
ఇకనుంచి ఎయిర్‌పోర్టుల్లో అంతర్జాతీయ ప్రయాణికుల నుంచి శాంపిల్స్ తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల విమానాశ్రయాలకు ఆదేశాలిచ్చింది. ప్రతి ఎయిర్‌పోర్ట్ వద్ద వైద్య సిబ్బందిని మోహరించింది. ప్రస్తుతం విదేశీ ప్రయాణికుల నుంచి మాత్రమే ర్యాండమ్‌గా శాంపిళ్లను సేకరిస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రత్వి శాఖ బుధవారం ప్రకటించింది. కొవిడ్ తీవ్రత ఆధారంగా దీన్నివిస్తారిస్తామని పేర్కొంది. రోజుకు 100 నుంచి 600 దాకా పరీక్షలను పెంచుతామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి యశ్‌పాల్ గార్గ్ వెల్లడించారు.
More Read : మహేశ్ బాబు కండిషన్ పెట్టాడు.. అందుకే సినిమాలకు దూరమయ్యా-నమ్రత –
ప్రజలు టీకాలు వేయించుకోవాలని సూచించారు. చైనాలో పెరుగుతున్న కొవిడ్-19 కేసులకు కారణమైన ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్7కు సంబంధించిన మూడు కేసులు భారత్‌లో వెలుగు చూసినట్లు అధికారులు తెలిపారు. గుజరాత్‌లోని బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ తొలిసారిగా బీఎఫ్7 కేసును గుర్తించిందని అన్నారు. గుజరాత్‌లో రెండుకేసులు, ఒడిశాలో ఒక్క కేసు ఇప్పటిదాకా నమోదైనవని వివరించారు.
ఇవి కూడా చదవండి …
-
భారత్ లో ప్రవేశించిన మరో కరోనా వేరియంట్.. బీఎఫ్.7 లక్షణాలు ఏంటి? –
-
నిజం నిప్పులాంటిది చెల్లెమ్మా.. నువ్వు జైలుకెళ్లడం ఖాయం-కవితకు రాజగోపాల్ రెడ్డి కౌంటర్ –
-
నాలుగో తరగతి విద్యార్థిని బాల్కనీ పైనుంచి తోసేసిన టీచర్ – చికిత్స పొందుతూ మరణించిన బాలుడు –
-
చంటిబిడ్డతోనే అసెంబ్లీకి వచ్చేసింది…సోషల్ మీడియాలో వైరల్ మారింది.
-
ఏసుక్రీస్తు దయవల్లే కరోనా తగ్గింది.. డీహెచ్ వ్యాఖ్యలు వివాదాస్పదం ! –
2 Comments