క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : క్రైమ్ మిర్రర్ చెప్పిందే అక్షర నిజమైంది. స్థానిక ఎక్సైజ్ అధికారులు మసిపూసిమారేడు చేసే ప్రయత్నం చేసినా క్రైమ్ మిర్రర్ మూడు నెలల క్రితం చెప్పిందే నిజమని తేలింది. భువనగిరి జిల్లాలో నకిలీ మద్యం అమ్మతున్నారని రుజువైంది. పోలీసులు ఏకంగా నాలుగు కోట్ల నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. భువనగిరి జిల్లాలో నకిలీ మద్యం అమ్ముతున్నారని ముూడు నెలల క్రితం క్రైమ్ మిర్రర్ వరుస కథనాలు రాసింది. నకిలీ మద్యం తాగి చాలా మంది అనారోగ్యం భారీన పడ్డారని తెలిపింది. అయితే మామూళ్ల మత్తులో ఉన్న ఎక్సైజ్ అధికారులు, స్థానిక పోలీసులు అలాంటిదేమి లేదంటూ కవరింగ్ ఇచ్చారు. కాని పాపం ఎక్కువ రోజులు ఉండదుగా. ఇప్పుడు వాళ్ల బండారం బయటపడింది. నకిలీ మద్యం బాగోతం గుట్టు రట్టైంది.
Read More : దమ్మాయిగూడ చెరువులో పదేళ్ల చిన్నారి మృతదేహం.. పోస్టుమార్టం రిపోర్టులో కీలక విషయాలు
హైదరాబాద్ శివారులో భారీ ఎత్తున నకిలీ మద్యం పట్టుబడింది. వేలు కాదు, లక్షలు కాదు.. రెండు కోట్ల రూపాయలకు పైగా విలువైన నకిలీ మద్యాన్ని సీజ్ చేశారు ఎక్సైజ్ పోలీసులు. హైదరాబాద్ శివారు ప్రాంతాలైన పెద్ద అంబర్ పేట్, హయత్ నగర్, చౌటుప్పల్, దేవల్లమ్మ నాగారం ఏరియాలో నకిలీ మద్యం డంప్‌ను గుర్తించిన ఎక్సైజ్ పోలీసులు.. ఆ డంప్‌ని స్వాధీనం చేసుకున్నారు. మందుబాబుల గుండె పగిలే విషయం ఏమిటంటే.. హైదరాబాద్ శివారు ప్రాంతాలతో పాటు భువనగిరి, నల్గొండ జిల్లాలోని ఉన్న మందుబాబులు.. ఇన్ని రోజులు తాగిన మందు మొత్తం నకిలీదే.
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో బెల్ట్ షాపుల్లో నకిలీ మద్యం అమ్ముతున్నట్లు హయత్‌నగర్ ఎక్సైజ్ పోలీసులకు విశ్వసనీయ సమాచారం వచ్చింది. రంగంలోకి దిగిన ఓ బృందం హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట్ సహా పలు ప్రాంతాల్లోని బెల్ట్ షాపులకు సైలెంట్‌గా వెళ్లారు. సాధారణ మద్యం కొనుగోలుదారుల్లా వెళ్లి బెల్ట్ షాపులో మద్యం కొనుగోలు చేసిన ఎక్సైజ్ పోలీసులు అవి నకిలీవిగా గుర్తించారు. ఓ బెల్ట్ షాపు నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. దీని వెనుక పెద్ద దందానే నడుస్తోందన్న విషయం బయటపడింది.ఆ బెల్ట్ షాప్ ఇచ్చిన సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు పెద్ద అంబర్ పేట్, హయత్ నగర్, చౌటుప్పల్, దేవలమ్మ నాగారం ఏరియాలో నకిలీ మద్యం తయారు చేస్తున్న డంప్‌ని గుర్తించారు. ఆ డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Read More : 12 ఏళ్ల బాలుడికి గుండెపోటు.. మధ్యప్రదేశ్ లో షాకింగ్ ఘటన
హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, చౌటుప్పల్‌లో సుమారు నాలుగు కోట్లకు పైగా విలువైన నకిలీ మద్యాన్ని అధికారులు సీజ్ చేశారు. ఈ డంప్ అంతా ఓ బడా మద్యం వ్యాపారి బింగి బాలరాజు గౌడ్‌కి చెందినదిగా పోలీసులు గుర్తించారు. వెంటనే బింగి బాలరాజు గౌడ్‌ను అదుపులోకి తీసుకోగా.. అతనికి పార్టనర్ గా ఉన్న మరో వ్యక్తి కొండల్ రెడ్డి పరారయ్యారు. మద్య వ్యాపారి బింగి బాలరాజు గౌడ్‌కు చెందిన గోదాంలో ఈ నకిలీ మద్యం పట్టుబడింది.
ఇవి కూడా చదవండి …
-
తెలంగాణ కాంగ్రెస్ లో తీన్మార్ మల్లన్న చిచ్చు.. రేవంత్ రెడ్డికి ఎసరు వచ్చినట్లేనా?
-
మునుగోడు ఓటర్లకు పంచింది నకిలీ మద్యం.. ప్రాణాలతో చెలగాటమాడిన నేతలపై కేసు పెట్టాల్సిందే!
-
ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉంది.. ప్రజలను భయపెడుతున్నారు-నాదెండ్ల
-
కనిపించకుండా పోయిన యువకుడు చెట్టుకు వేలాడుతూ..ప్రేమ వ్యవహారమే కారణమా?
4 Comments