
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ కు అనుకున్నంత రేటింగ్ రాకపోవడం నిర్వాహకులకు ఇబ్బందిగా మారింది. మొదటి నుంచి బిగ్ బాస్ ఆరో సీజన్ ను ప్రేక్షకులు ఆదరించలేదు. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనుకున్న వారు ఎలిమినేట్ అవగా గ్రాండ్ ఫినాలే వీక్ లో మరొకరిని పంపించి ఆటలాడుకుంటున్నాడు బిగ్ బాస్.ఇక ఎలిమినేషన్ ప్రాసెస్ సరిగా జరగడం లేదంటూ ఇప్పటికే నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదే సమయంలో ఇనయ ఎలిమినేట్ అవడం .. మరింత ఆగ్రహాన్ని తెప్పించింది.
ఇక ఇదే విషయంపై నాగార్జున కూడా సీరియస్ గా ఉన్నాడని తెలిసింది. ఇక మీదట బిగ్ బాస్ షోకి హెస్ట్ గా ఉండనంటూ వ్యాఖ్యానించాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతేకాదు నెక్స్ట్ సీజన్ కు విజయ్ దేవరకొండ వ్యాఖ్యాతగా రానున్నాడనే ప్రచారం ఊపందుకుంది. అసలు ఇందులో నిజమెంతుందో తెలియాల్సి ఉంది.
Read more : బండి చెప్పేశాడు.. ఈడీ నోటీస్ వచ్చేసింది! నెక్స్ట్ టార్గెట్ ఎవరో?
ఈ సీజన్ కు మొదటి నుంచి రేటింగ్ తక్కువగానే ఉంది. దీంతో బిగ్ బాస్ ఆరోసీజన్ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అన్ని సీజన్ల కంటే ఈ సీజన్ లాంఛింగ్ ఎపిసోడ్ కి అతి తక్కువ రేటింగ్ వచ్చింది. టీఆర్పీ 8.5 వచ్చింది. దీనిపై నాగార్జున సైతం అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీనికి తోడు సీజన్ లో మలుపులు, అన్ ఫెయిర్ ఎలిమినేషన్లు షోకు గుదిబండగా మారాయి. ఇక ఈ సీజన్ ఫ్లాప్ అని తేల్చి చెప్పేశారు ప్రేక్షకులు. కనీసం నెక్ట్స్ సీజన్ లోనైనా మంచి కంటెస్టెంట్లు, ఫెయిర్ ఎలిమినేషన్లు ఉండాలని ప్రేక్షకులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి …
2 Comments