
క్రైమ్ మిర్రర్,ఆన్లైన్ డెస్క్ : కళ్ళు కళ్ళు కలిశాయి.మనసులు మనసులు మాట్లాడుకున్నాయి. మూడు ముళ్ల బంధంతో ఏడడుగులు నడిచి నూతన జీవితంలోకి అడుగు పెట్టారు. కలిసి జీవనం సాగించాలనుకున్నారు. అయితే ఇదంతా చాలా మామూలు విషయమే .. ఇందులో ఏముంది వింత అనుకుంటున్నారు కదూ… యస్ మీరనుకుంటున్నట్టుగా సాధారణంగా ఆడా మగ ఇద్దరు కలిసి వివాహం చేసుకుంటే ఎవరూ కూడా పెద్దగా పట్టించుకోరు.వాటికి ఎలాంటి ప్రత్యేకతా కూడా ఉండదు. కానీ. ఓ ట్రాన్స్ జెండర్ ను ఒక వ్యక్తి వివాహం చేసుకోవడం మాత్రం వింతేగా ఇక ఆమెకోసం అతను సుదీర్ఘ కాలం ప్రేమంచి నిరీక్షించి తన మతం మార్చుకుని, పేరు కూడా మార్చుకుని, బాసటగా నిలుస్తాననడం… ఆమెతో కొత్త జీవితం… కొంగొత్త ఆశలతో… తన జీవిత భాగస్వామిగా స్వీకరించడం… ఆమె దిశానిర్దేశం చేసిన విధంగా ముందుకు సాగుతానని ప్రకటించడం. నిజంగా ఇదో మరో వింత ప్రేమ కథ కావ్యమని ఒప్పుకుంటారుగా…ఇంతకీ ఎప్పుడు ఎక్కడ జరిగింది. ఈ వింత ప్రేమ ,పెళ్లి వ్యవహారం.
Read More : భార్య లక్ష్మీ ప్రణతిని హత్తుకుని ఉన్న జూ.ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో వైరల్ –
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో శుక్రవారం రోజున ఒక్కటైన ఈ జంటలో కరీంనగర్ జిల్లా వీణవంకకు చెందిన దివ్య కొంత కాలంగా జమ్మికుంట పట్టణంలో జీవనం సాగిస్తుంది.గతంలో జగిత్యాలలో నివాసం ఉన్నప్పుడు ట్రాన్స్ జెండర్ గా మారిపోయింది. అక్కడే పరిచయం అయిన అర్షద్ తనను పెళ్లి చేసుకుంటానని రెండు మూడు సార్లు ప్రపోజ్ చేశాడు.అయితే, మొదట్లో నిరాకరించింది దివ్య.
More Read : అర్జెంటీనా టీమ్.. ట్రెండింగ్‌లో ఎస్‌బీఐ పాస్‌బుక్ –
ఇక ఆమెను ఒప్పించేందుకు గురువారం జమ్మికుంటకు వచ్చిన అర్షద్ తాను హర్షిత్ గా మారి దివ్య మెడలో మూడు ముళ్లు వేశాడు.ఇక దివ్య కూడా సర్జరీ కూడా చేయించుకున్న తరువాతే హర్షిత్ ప్రపోజల్ కు ఓకే చెప్పేసింది.కారు డ్రైవర్ గా జీవనం సాగిస్తున్న హర్షిత్ ఇక ముందు దివ్యతో ఆమె చెప్పినట్టుగా నడుచుకుంటూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నానన్నాడు. వివాహ బంధంతో ఒక్కటైన తాము ఆదర్శవంతమైన జీవితం గడుపుతామని దివ్య పేర్కొంది.శుక్రవారం జమ్మికుంటలో ఒక్కటైన ఈ జంట ఇల్లంతకుంట రామాలయంలో ఇద్దరు కలిసి ప్రత్యేక పూజలు చేశారు.
Read More : నాగాలాండ్.. 25కే ఆలౌట్ –
ఆడా, మగా వివాహం చేసుకోవడం ఆనవాయితీ.అయితే ఈ మధ్య కాలంలో ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు వివాహం చేసుకుని సహజీవనం చేయడం కూడా చాలా మాములయిపోయింది. ఇక జెండర్ మరో ట్రాన్స్ జెండర్ ల వివాహాలు కూడా అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి. ఇక ఇద్దరు వ్యక్తుల నడుమ పరిచయం స్నేహంగా చిగురించి ఆకర్షణ ప్రేమగా మారి… ఓ ట్రాన్స్ జెండర్ కోసం మరో జెండర్ తన మతం మార్చుకుని పేరు మార్చుకుని పెళ్లి బంధంతో ఒక్కటవడం మాత్రం మరో వింత ప్రేమ కథ అనడంలో సందేహం లేదు.
ఇవి కూడా చదవండి …
- పుజార.. ఎన్నాళ్లకెన్నాళ్లకు – సుదీర్ఘ నిరీక్షణకు తెర దించిన నయా వాల్ – దాదాపు నాలుగేళ్ల తర్వాత సెంచరీ –
- 15 పరుగులకే చాప చుట్టేశారు – టీ20 చరిత్రలో అత్యంత చెత్త రికార్డు –
- మాచర్లలో 144 సెక్షన్… ఫ్యాక్షన్ గొడవల !! –
- రకుల్ కు ఈడీ నోటీసులు.. ఆయనకు ఉచ్చు బిగుస్తోందా? –
- బిగ్ బాస్ నుంచి తప్పుకున్న నాగార్జున.. నెక్ట్స్ వ్యాఖ్యాత అతనేనా? –
2 Comments