
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఆదిభట్ల కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి కస్టడీ పిటిషన్ పై ఇబ్రహింపట్నం కోర్టులో విచారణ జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జైలు ఉన్న నవీన్ రెడ్డిని మెజిస్ట్రేట్ విచారించారు. ఇద్దరి మధ్య స్నేహం, ప్రేమ, విడిపోవడంపై నవీన్ రెడ్డిని విచారించారు. వైశాలిని కిడ్నాప్ చేయాలన్న ఉద్దేసం నవీన్ రెడ్డికి లేదని అతని తరఫు న్యాయవాది విష్ణువర్ధన్ రెడ్డి వాదించారుఈ కేసులో 307 వర్తించదంటూ విష్ణువర్ధన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇద్దరి మధ్య పరిచయం, స్నేహం, ప్రేమ తర్వాత విడిపోయినటువంటి పరిణామాల మధ్య జరిగిన సంఘటనలను మెజిస్ట్రేట్‌కు లాయర్ వివరించారు. నవీన్ రెడ్డిని వైశాలి రూ.5లక్షల వరకు వాడుకుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వైశాలి వాడుకున్న డబ్బులపై ఆధారలివ్వాలని కోర్టు ఆదేశించింది. తుదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
Read Read : బీజేపీలో ఈటలకు ఘోర అవమానం! బండి సంజయ్ కావాలనే చేస్తున్నారా?
డిసెంబర్ 9న నవీన్ రెడ్డి దాదాపు 100 మందితో వచ్చి విధ్వంసం సృష్టించి వైశాలని కిడ్నాప్ చేశాడు. దీంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న నవీన్ రెడ్డి వైశాలి తన స్నేహితుడికి అప్పజెప్పి హైదరాబాద్ లో విడిచి పెట్టి రావాలని చెప్పాడు. తన ఫోన్ ను మరో కారులో వేసి విజయవాడ పైపు పంపించాడు. దీంతో పోలీసులు కాసేపు కాన్ఫ్యూజ్ అయ్యారు.
నవీన్ రెడ్డి తన వోల్వ కారులో శంషాబాద్ వైపు వెళ్లాడు. అక్కడ కొంత సేపు ఉన్న తర్వాత కారు అక్కడే వదిలి బెంగళూరు వెళ్లాడు. అక్కడి నుంచి గోవా వెళ్లాడు. నవీన్ రెడ్డిని పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు.అరెస్ట్ అయిన తర్వాత నవీన్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేశాడు. వైశాలి స్నేహితురాలు సంధ్య ద్వారా తనకు వైశాలి పరిచయమైనట్లు నవీన్ రెడ్డి చెప్పాడు. ఆమె తాను కలిసి బ్యాడ్మింటన్ ఆడేవాళ్లమని తెలిపాడు.వైశాలితో కలిసి తిరిగిన వీడియోలను నవీన్ రెడ్డి విడుదల చేశాడు.
ఇవి కూడా చదవండి …
One Comment