
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో :
ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో ఈరోజు నుండి నెల రోజులు పాటు ధనుర్మాస ఉత్సవాలు జరుగును. ఈ రోజు సాయంత్రం 6.17 గంటలకు ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. వచ్చే నెల అంటే జనవరి 15వ తేదీ వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. సంక్రాంతి పండుగకు ముందే చేపట్టే ధనుర్మాస ఉత్సవాల్లో గోదాదేవి మనోవల్లభుడైన శ్రీంగ నాథుడిని ఆరాధించే పర్వాలు నిర్వహిస్తారు.
Read More : వన్ నేషన్ – వన్ ఎలక్షన్ వైపే కేంద్రం మొగ్గు.. జమిలి ఎన్నికలు –
ప్రతిరోజూ ఉదయం 4.30 గంటలకు శ్రీ ఆండాల్ అమ్మవారికి ఉత్సవ సేవ నిర్వహిస్తారు. ఉదయం 4.30 గంటల నుంచి 5.15 గంటల వరకు ఆలయ ముఖ మండపంపైన ఉత్తర భాగంలోని హాల్ లో అమ్మవారిని వేంచేపు చేసి తిరుప్పావై కార్యక్రమం జరిపించనున్నారు. బ్రహ్మీకాలంలో అమ్మవారు స్వామి వారిని ఆరాధించే పర్వాన్ని పాశుర పఠనం, పొంగళి నివేదనలతో కొనసాగిస్తారు. జనవరి 14వ తేదీన రాత్రి 7 గంటలకు గోదాదేవి కల్యాణం, మర్నాడు అంటే జనవరి 15వ తేదీన ఉదయం 11.30 గంటలకు ఒడి బియ్యం సమర్పణతో ఈ ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ అదికారులు తెలిపారు.
More Read : భారత ఆర్థికవ్యవస్థ : ‘‘జీతాలు పెరగలేదు.. అద్దెలు, ధరలు, చార్జీలు అన్నీ పెరిగిపోయాయి.. రెండు ఉద్యోగాలు చేసినా పూట గడవటం కష్టమవుతోంది’’ –
తెలంగాణ ప్రజల ఇలవేల్పు, ఇష్టదైవం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆయం యాదాద్రిని రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. యాదాద్రి కొండ దిగువన కూడా యాదగిరిగుట్ట పట్టణంలో సుందరీకరణ పనులు చేసింది. కనుక సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఈ ధనుర్మాసంలో స్వామి వారి చెంత ఉన్న కొలువైన అమ్మవారిని దర్శించుకోవడం చాలా శుభప్రదం.
Read More : భారతదేశాన్ని ఉద్ధరిస్తానంటూ బయల్దేర కేసీఆర్ !!!…టార్గెట్ చేసిన విజయశాంతి
Read More : తెలంగాణాలో YSRTP కార్యాలయం..వైఎస్ షర్మిల మరో ముందడుగు..
ఇవి కూడా చదవండి …
- వేటకు వెళ్లి గుహలో చిక్కుకున్న రాజు… బండరాళ్లను బద్దలు కొట్టి బయటకు తీసిన రెస్క్యూ టీమ్ –
- బీఆర్ఎస్ పార్టీ ఎఫెక్ట్ నాలుగింతలు పెరిగిన ఫ్లైట్ టికెట్ ధరలు..అవాక్కయిన ప్రయాణికులు
- తెలంగాణలో రాజకీయ పార్టీల హడావిడి … ముందస్తు సర్వేలు
- ఆరెస్సెస్ అనుబంధ సంస్థలు…19న ఢిల్లీలో కిసాన్ గర్జన –