
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో కాక రేపింది. ప్రధాన పార్టీలు సవాల్ గా తీసుకోవడంతో పోటీ హోరాహోరీగా సాగింది. ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో చివరికి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిచారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 10 వేల ఓట్లతో విజయం సాధించారు. ఈ ఎన్నికలో కూసుకుంట్ల గెలుపు కోసం గులాబీ పార్టీ తీవ్రంగా శ్రమించింది. మునుగోడును సవాల్ గా తీసుకున్న సీఎం కేసీఆర్ ఏకంగా 14 మంది మంత్రులు, వంద మంది ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను రెండు వారాల పాటు మునుగోడులోనే ఉంటారు. గ్రామానికో లీడర్ లో ఇంచార్జ్ గా నియమించారు. అధికార పార్టీ భారీగా ఖర్చు పెట్టింది. ఇంత చేసినా కేవలం 10 వేల ఓట్లతో గటెక్కారు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.
Read More : రాజయోగం కోసమే సీఎం కేసీఆర్ రాజ్యశ్యామల యాగం!
మునుగోడు ఉప ఎన్నిక సమయంలో గులాబీ పార్టీ ఊహించని షాక్ ఇచ్చారు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్. కేసీఆర్ సవాల్ గా తీసుకున్నా.. నామినేషన్ల తర్వాత బూర జంప్ కొట్టారు. ఇది పార్టీలో కలకలం రేపుతోంది. నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గానికి చెందిన పోలింగ్ కు కొన్ని రోజుల ముందు బీజేపీలో చేరడం నియోజకవర్గంలో భారీగానే ప్రభావం చూపింది. బూర ఇచ్చిన షాక్ తో కేసీఆర్ కూడా కలవరపడ్డారని తెలుస్తోంది. ఆ డ్యామేజీని పూడ్చుకోవడానికే వెంటనే మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య గౌడ్, పల్లె రవికుమార్ గౌడ్ లను పార్టీలో చేర్చుకున్నారు. ఇదొక్కటే కాదు మునుగోడు ఎన్నికల ప్రచారంలోనూ కేసీఆర్ టార్గెట్ గా తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ప్రచారం చేశారు బూర నర్సయ్య గౌడ్.
Read More : జర్నలిస్టులకు పెన్షన్ స్కీం ప్రవేశపెట్టాలి
సీన్ కట్ చేస్తే హోరాహోరీ పోరులో గెలిచిన మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తాజాగా చేసిన ఓ ఘటన నియోజకవర్గంలోని టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు పిలుపు పేరుతో ఓ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. అందులో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డితో పాటు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫోటోలతో పాటు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఫోటో ఉంది. ఇదే ఇప్పుడు రచ్చగా మారింది. పార్టీ మారి టీఆర్ఎస్ ఓటమి కోసం తీవ్రంగా కష్టపడిన బూర నర్సయ్య గౌడ్ ఫోటోను ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. మునుగోడు నియోజకవర్గానికే చెందిన మాజీ ప్రభుత్వ విప్ కర్నెప్రభాకర్ ఫోటో లేకుండా పార్టీ మారిన బూర ఫోటో ఉండటం అందరిని షాకింగ్ కు గురి చేస్తోంది. దీనిపై గులాబీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. ఇంత గుడ్డిగా ఎమ్మెల్యే ఎలా వ్యవహరిస్తాంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి …
2 Comments