
క్రైమ్ మిర్రర్, నల్గొండ ప్రతినిధి : ఎన్నికలకు ఒక నెల ముందు వరకు రాజకీయాలపై ఏమీ మాట్లాడనని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.భవిష్యత్తులో నల్గొండ నుంచే ఎమ్మెల్యేగా పోటీచేస్తానని తెలిపారు. 2023 ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ భారీ కార్యవర్గాన్ని తాజాగా ప్రకటించింది. అయితే, ఈ కార్యవర్గంలో వెంకట్‌రెడ్డిని పక్కనపెట్టింది. నల్గొండలో మీడియాతో మాట్లాడారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రకటించిన కార్యవర్గంలో కోమటిరెడ్డికి చోటు కల్పించలేదు. రాష్ట్ర వ్యవహరాల్లో కీలకంగా వ్యవహరించే పీఏసీ, పీఈసీల్లో ప్రజా ప్రతినిధులకు చోటు కల్పించింది. ఈ పరిణామాల నేపథ్యంలో మీడియా ప్రతినిధులు కోమటిరెడ్డిని ప్రశ్నించారు.
Read More : కవితకు సీబీఐ 50 ప్రశ్నలు.. ఫోన్లు పగలగొట్టడంపై సైలెన్స్!
‘ప్రస్తుతం కాంగ్రెస్ కండువా ఉంది. మిగతా సంగతి తర్వాత ఆలోచిద్దాం.ఎన్నికలకు నెలముందు వరకు రాజకీయాలపై మాట్లాడను. మంత్రి పదవినే వదిలేశా.. పార్టీ పదవులు నాకో లెక్కనా?’ అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొద్ది రోజులుగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. ఈ వ్యవహార శైలి కారణంగానే కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రకటించిన కమిటీల్లో కోమటిరెడ్డి కి స్థానం దక్కలేదనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు పార్టీకి వ్యతిరేకంగా రాజగోపాల్ రెడ్డి విజయం కోసం పరోక్షంగా పనిచేశారనే ఆరోపణలతో రెండు సార్టు పార్టీ జాతీయ కమిటీ నోటీసులు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి …
-
క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించడం మర్చిపోయి ఫైన్‌తో కడుతున్నారా.. అదనపు చార్జీలన్ని తిరిగి పొందవచ్చు
-
పెళ్లికి కొద్దిగంటల ముందు పెళ్లికూతురు ఆత్మహత్య.. కాబోయే భర్త వేధింపులే కారణమా ?..నిజమేంటి?
-
‘మిస్టర్ టీ’… రాస్తే కథ, తీస్తే సినిమా…ట్విస్టులే ట్విస్టులు
-
చుట్టూ చీకటి.. నాన్న భయమేస్తోంది.. బోరుబావిలో పడిన బాలుడి ఆవేదన
One Comment