Telangana

ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో నేడు కవిత వివరణ… హైదరాబాద్‌కు చేరుకున్న సీబీఐ అధికారులు

క్రైమ్ మిర్రర్, ప్రత్యేక ప్రతినిధి : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు వ్యవహారంలో సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ మలుపులు తిరుగుతోంది. సీబీఐకు వివరణ ఇవ్వడంపై కవిత రోజుకో ట్విస్ట్ ఇస్తోన్నారు. వివరణ ఇస్తానంటూ ఒకరోజు.. వివరణ ఇవ్వలేనని, వేరే తేదీలలో వచ్చి వివరణ తీసుకొవచ్చంటూ మరో రోజు సీబీఐకు కవిత ఆప్షన్లు ఇస్తోన్నారు. ఈ నెల 6న వివరణ ఇవ్వాలని సీబీఐ నోటీసుల్లో పేర్కొనడం, సోమవారం రాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు సీబీఐ అధికారులు చేరుకోవడంతో నేడు ఏం జరగబోతుందనేది సస్పెన్స్‌గా మారింది.

Read Also : ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై సి‌ఎం ప్రత్యేక దృష్టి….ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సి‌ఎం దూకుడు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి వివరణ ఇవ్వాలని గత శుక్రవారం కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 6న హైదరాబాద్ లేదా ఢిల్లీలో సీబీఐ అధికారులకు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. అదే రోజు సీబీఐ నోటీసుకు కవిత రిప్లై ఇచ్చారు. హైదరాబాద్‌లోని తన ఇంట్లో 6వ తేదీన వివరణ ఇస్తానని సమాాచారం అందించారు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ తర్వాత కవిత స్వరం మార్చారు. ముందుగా షెడ్యూల్ చేసుకున్న కార్యక్రమాల వల్ల 6వ తేదీన వివరణ ఇవ్వలేనని, మరో తేదీలలో రావాలంటూ నాలుగు తేదీలను పేర్కొంటూ కవిత సీబీఐకు సోమవారం మరో లేఖ రాశారు.

Also Read : ద్విచక్ర వాహనం పక్కన అపమన్నందుకు ఆటో డ్రైవర్ పై దాడి… డ్రైవర్ బందువులను అడ్డుకున్న పోలీసులు

చట్టాన్ని తాను గౌరవిస్తానని, దర్యాప్తుకు సహకరిస్తానంటూ లేఖలో పొందుపర్చారు. కవిత లేఖపై ఇప్పటివరకు సీబీఐ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. మంగళవారం కవిత వివరణ తీసుకోవాల్సి ఉన్న క్రమంలో సోమవారం రాత్రి నలుగురు సీబీఐ అధికారులు ఢిల్లీ నుంచి కోఠిలోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. కవిత వివరణ తీసుకునేందుకు ఇప్పటికే సీబీఐ అధికారులు ఢిల్లీ నుంచి రావడం, నేడు వివరణ ఇవ్వలేనంటూ కవిత లేఖ రాసిన క్రమంలో అసలు ఏం జరుగుతుందనేది సస్పెన్స్‌గా మారింది. సోమవారం కవిత రాసిన లేఖకు సీబీఐ నేడు సమాధానం ఇచ్చే అవకాశముంది.

Read Also : రన్నింగ్ బస్సులో డ్రైవర్ కి గుండెపోటు.. స్టీరింగ్ పై కుప్పకూలి మృతి.. ఆ తర్వాత

హైదరాబాద్ చేరుకున్న అధికారులు… ఇప్పటికే కవితను ఏయే ప్రశ్నలను అడగాలనే విషయాలను సిద్దం చేసి ఉంచుకున్నారు. కస్టడీలో నిందితులు ఇచ్చిన స్టేట్‌మెంట్లు, ఫోన్ సంభాషణలను కూడా సీబీఐ అధికారులు తమ వెంట తెచ్చుకున్నట్లు సమాచారం. దీంతో ఇవాళ ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా మారింది. వివరణ కోసం మంగళవారం సీబీఐ అధికారులు కవిత ఇంటికి వెళతారా? సీబీఐ నెక్ట్స్ యాక్షన్ ఎలా ఉంటుంది? అనేది చర్చనీయాంశంగా మారింది. సీబీఐకు వివరణ ఇచ్చే ప్రక్రియ ఆలస్యం చేసేందుకు కవిత ఇలా రోజుకో మాట మాట్లాడుతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

ఇవి కూడా చదవండి : 

  1. తెలంగాణ బీజేపీ లీడర్లకు అమిత్ షా క్లాస్!
  2. కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి…. రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారని ఆగ్రహం
  3. మర్రి శశిధర్ రెడ్డికి లీగల్ నోటీసులు….
  4. పాదయాత్రలపై మనసు పారేసుకుంటున్న ప్రతిపక్ష నేతలు… ఎన్నికల మూడ్ లోకి తెలంగాణ
  5. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహం… త్వరలో బస్సుయాత్ర చేయనున్న బండి సంజయ్!!!

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.