

క్రైమ్ మిర్రర్, ప్రత్యేక ప్రతినిధి : అంతర్జాతీయ సెక్స్ రాకెట్ ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. యువతులకు ఉపాధి కల్పిస్తామని చెప్పి వ్యభిచారం చేయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. అమ్మాయిలకు, కస్టమర్లకు డ్రగ్స్ ఇచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వివరించారు. ఈ భారీ సెక్స్ రాకెట్ ను యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ పట్టుకుంది. ఈ సెక్స్ రాకెట్ ముఠాలో 17మందిని అరెస్ట్ చేశారు. 15నగరాల నుంచి వారిని రప్పించి సెక్స్ రాకెట్స్ నడుపుతున్నారు. వెబ్ సైట్, వాట్సప్ గ్రూప్స్, కాల్ సెంటర్లు, యాడ్స్ ద్వారా కస్టమర్లను ఆకర్షించి అమ్మాయిలను సప్లై చేస్తున్నారు.
Read Also : చావనైనా చస్తాం కానీ టీఆర్ఎస్ను వీడేదిలేదు… అసెంబ్లీ స్పీకర్ పోచారం కీలక వ్యాఖ్యలు
39 కేసుల్లో నిందితులకు ప్రమేయం ఉన్నట్లు తేలింది. 1419 మంది అమ్మాయిలు ఉన్నట్లు గుర్తించామని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన అమ్మాయిల తో పాటు విదేశీ మహిళలతో సెక్స్ రాకెట్స్ నడుపుతున్నారు. సెక్స్ రాకెట్స్ తో పాటు డ్రగ్స్ కూడా సప్లై చేస్తూ కస్టమర్ల కు ఎర వేస్తున్నారు. సైబరాబాద్ లో ఐదు కేసులు నమోదు చేసి విచారిస్తున్నామని స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. సప్లయర్లు, బ్రోకర్ల ద్వారా బాధితులను కస్టమర్ల దగ్గరకు పంపుతున్నారు.విమానాల్లో కూడా అమ్మాయిలను వేరే రాష్ట్రాల్లో కస్టమర్ల దగ్గరకు పంపుతున్నారు. ఈ సెక్స్ రాకెట్ లో ఏపీ ,తెలంగాణా,కర్ణాటక ,ఢిల్లీ,ముంబై, కోల్ కతాకి చెందిన వారు భాదితులుగా ఉన్నారని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
Also Read : ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో పొడిగింపు… మంత్రి కేటీఆర్ మరో కీలక ప్రకటన
బంగ్లాదేశ్,నేపాల్,థాయ్ ల్యాండ్, రష్యా కి చెందిన అమ్మాయిలతో కూడా ఈ దందా చేయిస్తున్నారు. వ్యభిచారం ద్వారా వచ్చిన మొత్తంలో 30శాతం అమ్మాయిలకు, 35శాతం యాడ్స్, వెబ్ సైట్ కి, 35శాతంఆర్గనైజర్లకి వెళుతుంది. హ్యూమన్ ట్రాఫికింగ్ లో ఆర్నావ్ అనే వ్యక్తి కీలక నిందితుడని స్టీఫెన్ రవీంద్ర వివరించారు. 915 మంది అమ్మాయిలని ముంబై, కోల్ కతా నుండి సప్లై చేశాడు. 2019 నుండి సమీర్ అనే వ్యక్తి 850 మంది అమ్మాయిలను సప్లై చేస్తున్నాడు. అనంతపూర్ , కరీంనగర్ నుండి రెండు తెలుగు రాష్ట్రాలలో సెక్స్ రాకెట్ నడుపుతున్నారు.
సైబరాబాద్ ,రాచకొండ,హైదరాబాద్ లో ఆర్నావ్ అనే వ్యక్తి ఈ డ్రగ్స్, వ్యభిచార దందా చేస్తున్నాడు.
Read Also : తెలంగాణ రాజకీయాలలో ఊహించని పరిణామం… షర్మిలకు ప్రధాని మోదీ ఫోన్
ఆర్నావ్ 950 మంది అమ్మాయిలతో హైదరాబాద్ లో సెక్స్ రాకెట్ నడుపుతున్నాడు. సోమజిగూడలో ఆర్నావ్ ను ఓ ఫ్లాట్ లో పట్టుకున్నామని.. అదే ఇంట్లో MDMA డ్రగ్స్ ను సీజ్ చేశామని సీపీ చెప్పారు. ఈ సెక్స్ రాకెట్ వివిధ గ్రూప్ లుగా విడిపోయి ఈ దందా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. కొన్ని హోటల్స్ కి పని చేసే వాళ్ళ కూడా ప్రమేయం ఉందని.. వారిని కూడా అరెస్ట్ చేశామని స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. వెబ్ సైట్ లో బుక్ చేసుకున్న వారికి అమ్మాయిలని సప్లై చేస్తున్నారని.. జాబ్ లేని అమ్మాయిలను, పేదరికంలో ఉన్న అమ్మాయిలను జాబ్స్ పేరుతో వ్యభిచారం చేయిస్తున్నారని చెప్పారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్టు స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
ఇవి కూడా చదవండి :
-
ఖమ్మం జిల్లాలో వేప చెట్టు నుంచి పాలు… బ్రహ్మంగారు చెప్పినట్లే జరుగుతుందని పూజలు
-
ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో నేడు కవిత వివరణ… హైదరాబాద్కు చేరుకున్న సీబీఐ అధికారులు
-
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై సిఎం ప్రత్యేక దృష్టి….ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సిఎం దూకుడు
-
తెలంగాణ బీజేపీ లీడర్లకు అమిత్ షా క్లాస్!
-
పాదయాత్రలపై మనసు పారేసుకుంటున్న ప్రతిపక్ష నేతలు… ఎన్నికల మూడ్ లోకి తెలంగాణ
5 Comments