Telangana

ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై సి‌ఎం ప్రత్యేక దృష్టి….ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సి‌ఎం దూకుడు

క్రైమ్ మిర్రర్, ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ మరింత దూకుడు పెంచారు. టీఆర్ఎస్ అధినేతగా పార్టీ కార్యక్రమాలతో పాటు సీఎంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కొత్త సంక్షేమ పథకాలను ప్రారంభించడంతో పాటు ఇప్పటికే ప్రకటించిన పథకాలకు నిధులు మంజురు చేసే పనిలో ఉన్నారు. మరోవైపు కొత్త అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు ఇప్పటికే జరుగుతున్న అభివృద్ధి పనులను షురూ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తోన్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

Read Also : రన్నింగ్ బస్సులో డ్రైవర్ కి గుండెపోటు.. స్టీరింగ్ పై కుప్పకూలి మృతి.. ఆ తర్వాత

రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల మరమ్మత్తుల కోసం రూ.2,500 కోట్ల నిధులను మంజురూ చేశారు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్ల మరమ్మత్తుల కోసం రోడ్లు, భవనాల శాఖ వీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల మరమ్మత్తు పనులను యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కేసీఆర్ ఆదేశాలతో వేసవికాలంలోపు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లకు మరమ్మత్తులు చేసేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. రోడ్లు, భవనాల శాఖ అధికారులతో తాజాగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌ అండ్‌ బీ రోడ్ల పనులకు కేసీఆర్ రూ.2,500 విడుదల చేసినట్లు వెల్లడించారు.

Also Read : తెలంగాణ బీజేపీ లీడర్లకు అమిత్ షా క్లాస్!

రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న కల్వర్టుల మరమ్మత్తులు, రోడ్ల పునరుద్దరణ పనులు, వరదల వల్ల దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తుల కోసం వీటిని వినియోగించనున్నట్లు తెలిపారు. డిసెంరబ్ 15లోగా కాంట్రాక్టర్లకు వర్క్ అగ్రిమెంట్లు అందేలా చేసి త్వరితగతిన పనులు ప్రారంభించాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గాల వారీగా పనులు చేపట్టాలని, స్థానిక ఎమ్మెల్యేల సూచనలతో పనులు నిర్వహించాలని జిల్లాల సూపరిటెండెంటట్ ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు ప్రశాంత్ రెడ్డి సూచించారు. రోడ్ల మరమ్మత్తులను వేసవి కాలంలోపు పూర్తి చేయాలని సూచించారు.

Read Also : కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి…. రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారని ఆగ్రహం

కాంట్రాక్టర్లు పనులు వేగవంతంగా చేసేలా చూడాలని ప్రశాంత్ రెడ్డి సూచించారు. కాగా రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల రోడ్లు, కల్వర్టులు బాగా దెబ్బతిన్నాయి. తాత్కాలికంగా వాటికి మరమ్మత్తులు చేశారు. ఇప్పుడు వాటిని పునరుద్దరించడంతో పాటు వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లకు మరమ్మత్తులు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. పనుల్లో ఇంజినీర్లు సంప్రదాయక పద్దతులను వదిలేసి ఆధునాతన, డైనమిక్ పద్దతులు ఉపయోగించాలని కేసీఆర్ సూచించారు. రోడ్ల మరమ్మత్తులు అనేవి నిరంతర ప్రక్రియ అని, అది కొనసాగుతూనే ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి : 

  1. తిరుమల శ్రీవారి సేవలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము… రాష్ట్రపతి హోదాలో తొలిసారి
  2. 8వ రోజు కొనసాగుతున్న ప్రజాసంగ్రామ యాత్ర… కే‌సి‌ఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసిన బండి
  3. మర్రి శశిధర్ రెడ్డికి లీగల్ నోటీసులు….
  4. పాదయాత్రలపై మనసు పారేసుకుంటున్న ప్రతిపక్ష నేతలు… ఎన్నికల మూడ్ లోకి తెలంగాణ
  5. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహం… త్వరలో బస్సుయాత్ర చేయనున్న బండి సంజయ్!!!

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.