

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం భాగ్యనగర్ గుడి తండా గ్రామానికి చెందిన రాందాస్ కుటుంబ సభ్యులు తమ ఇంటి ఆవరణలోని ఓ వేప చెట్టు కింద నిత్యం పూజలు చేస్తుంటారు. కొంత కాలంగా ఈ వేప చెట్ట నుంచి తెల్లటి ద్రవం కారటాన్ని వారు గమనించారు. ఈ విషయం ఆనోటా, ఈనోటా తెలిసి గుడి తండాతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు భారీ ఎత్తున రాందాస్ ఇంటికి చేరుకొని వేప చెట్టుకు పాలు కారటాన్ని చూస్తున్నారు. దేవుని మహిమతోనే వేప చెట్టుకు పాలు కారుతున్నాయంటూ గ్రామస్తులు కొబ్బరి కాయలు కొట్టి, ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
Read Also : ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో నేడు కవిత వివరణ… హైదరాబాద్కు చేరుకున్న సీబీఐ అధికారులు
ఇలాంటి వింత ఘటన తాము ఎప్పుడూ చూడలేదని., బ్రహ్మంగారు చెప్పినట్లే జరిగిపోతోందంటూ అక్కడి ప్రజలు చెప్పుకుంటున్నారు. వేప చెట్టుకు పాలు కారటాన్ని అందరూ వింతగా చూస్తున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ సింగరౌలీలోని నిగాహిలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ వేపచేట్టు నుంచి పాల రూపంలో ద్రవం కారటాన్ని స్థానికులు గమనించారు. ఇలా పాలు కారటం షీత్లా మాత మహిమే అని పాలను అమ్మవారి ప్రసాదంగా భావిస్తామని అక్కడి ప్రజలు చెప్పారు. వందలాది మంది భక్తులు వేపచెట్టు దగ్గర గూమిగూడి ప్రత్యేక పూజలు చేశారు. చెట్టు నుంచి కారే పాలను పాత్రల్లో నింపి ఇంటికి తీసుకెళారు. ఈ పాలను తాగితే అనేక రోగాలు నయమవుతాయని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి :
- ద్విచక్ర వాహనం పక్కన అపమన్నందుకు ఆటో డ్రైవర్ పై దాడి… డ్రైవర్ బందువులను అడ్డుకున్న పోలీసులు
- ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై సిఎం ప్రత్యేక దృష్టి….ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సిఎం దూకుడు
- రన్నింగ్ బస్సులో డ్రైవర్ కి గుండెపోటు.. స్టీరింగ్ పై కుప్పకూలి మృతి.. ఆ తర్వాత
- తెలంగాణ బీజేపీ లీడర్లకు అమిత్ షా క్లాస్!
- రాజాసింగ్ కు బీజేపీ షాక్! గోషామహాల్ బరిలో విక్రమ్ గౌడ్?
One Comment