

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ లీడర్లు కమలం గూటికి చేరుతున్నారు. ఇటీవలే మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకున్నారు. అయితే చేరికల విషయంలో తెలంగాణ బీజేపీ నేతల తీరుపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. యంగ్ లీడర్లను కాకుండా సీనియర్లను ఎందుకు పార్టీలో చేర్చుకుంటారని నిలదీశారని సమాచారం. ముఖ్యంగా మర్రి శశిధర్ రెడ్డి వంటి నేతలతో పని ఏంటని అమిత్ షా క్లాస్ పీకారని అంటున్నారు.
Read More : పాదయాత్రలపై మనసు పారేసుకుంటున్న ప్రతిపక్ష నేతలు… ఎన్నికల మూడ్ లోకి తెలంగాణ
మర్రి శశిధర్ రెడ్డిని కాంగ్రెస్ లోనే ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎప్పుడో ఆయన తండ్రి ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా చేశాడని ఆయన వారసత్వాన్ని కాంగ్రెస్ లో కొనసాగించారు. కానీ ఆయనకు గెలిచే పరపతి లేదు. ఎన్నికల్లో నిలబడితే ఓట్లు పడే ఛాన్స్ లేదు. సీనియరిటీ పేరు చెప్పి పబ్బం గడుపుకోవడం తప్ప వీరితో ఎటువంటి ప్రయోజనం లేదు అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అక్కడ యువతకు ప్రాధాన్యతనిస్తోంది. యువ లీడర్లను పార్టీలో చేర్చుకొని వారికి పగ్గాలు అప్పగించి గెలుస్తోంది. తెలంగాణలోనూ బండి సంజయ్ లాంటి యువ దూకుడైన నేతకు రాష్ట్ర బీజేపీ బాధ్యతలు అప్పగించి ఇక్కడ బలోపేతం అయ్యింది.ఈ క్రమంలోనే తెలంగాణ యువ నేతలకు గాలం వేయాల్సింది పోయి ఔట్ డేటెడ్ నేతలైన మర్రి శశిధర్ రెడ్డి లాంటి వారిని పార్టీలో చేర్చుకోవడంపై బీజేపీ పెద్ద అమిత్ షా సీరియస్ అయ్యాడని సమాచారం. గెలవలేని వాళ్లను పార్టీలో చేర్పించి యూత్ కి ఏమీ సమాధానం చెప్తారు అని రాష్ట్ర బీజేపీ క్లాస్ పీకారు అంట..
Read More : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహం… త్వరలో బస్సుయాత్ర చేయనున్న బండి సంజయ్!
ముఖ్యంగా మర్రి శశిధర్ రెడ్డి చేరిక విషయంలో అమిత్ షా అసంతృప్తిగా ఉన్నాడట.. అతడికి క్షేత్రస్థాయిలో ఇమేజ్ లేదు.. అలాంటి వాళ్లను చేర్పించుకుంటే యూత్ ఎవరూ రారు అని హితబోధ చేశాడు.ప్రతీ రాష్ట్రంలోనూ యువతను తీసుకొని వారికి అవకాశాలిచ్చి రాజకీయంగా ఎదుగుతున్న బీజేపీకి తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ వదిలించుకోవాలనుకునే నేతలను చేర్పించుకుంటూ బలహీనం కావడాన్ని అమిత్ షా అస్సలు ఒప్పుకోవడం లేదట.. ఇలాంటి పనులు చేయవద్దని నేతలకు క్లాస్ పీకాడటకాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన డీకే అరుణ్ ఈ పనిచేశారు. ఆమెనే కాంగ్రెస్ సీనియర్లను లాగి ఢిల్లీకి తీసుకెళ్లి చేర్పిస్తున్నారు. మర్రి శశిధర్ రెడ్డిని కూడా ఈమెనే చేర్పించిందట.. తనకున్న కాంగ్రెస్ పరిచయాలతో మరింత మందిని చేర్పించేందుకు రెడీ అయ్యిందట.. కానీ ఔట్ డేటెడ్ నేతలు వద్దని.. యువతకు అవకాశం ఇవ్వాలని అమిత్ షా కాస్తా గట్టిగానే హితబోద చేసినట్టు సమచారం.
ఇవి కూడా చదవండి …
-
కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి…. రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారని ఆగ్రహం
-
తిరుమల శ్రీవారి సేవలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము… రాష్ట్రపతి హోదాలో తొలిసారి
-
8వ రోజు కొనసాగుతున్న ప్రజాసంగ్రామ యాత్ర… కేసిఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసిన బండి
-
కొడుకును డాక్టర్ చేస్తే, డాక్టర్ కోడలు గిఫ్ట్‌గా వచ్చింది… మంత్రి మల్లారెడ్డి ఎమోషన్
-
మర్రి శశిధర్ రెడ్డికి లీగల్ నోటీసులు…
2 Comments