
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఓ విద్యార్థిని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం స్టానికంగా సంచలనం రేపింది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం చోటు చేసుకుంది. తిరుమలగిరిలో కేశవ నాయక్ తండాకు చెందిన ఓ కుటుంబంతో సహా ఇటీవల హైదరాబాద్ లోని శుభకార్యం కార్యక్రమానికి బయలుదేరారు. అయితే పదవ తరగతి చదువుతున్న చిన్న కూతురు మాత్రమే ఇంట్లో ఒంటరిగా ఉంది. ఈ విషయం గమనించిన కొందరు యువకులు అర్ధరాత్రి ఇంటికి వెళ్లి ఆ బాలికను బలాత్కారం చేసినట్టు తెలుస్తోంది.
Read Also : ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆ ముగ్గురు సీఎంలు… బీజేపీ నేత తరుణ్ చుగ్ కీలక వ్యాఖ్యలు
శనివారం తెల్లవారుజామున ఆరు గంటల సమయంలో చిన్న కూతురు తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఎక్కడున్నారని సమాచారం కనుక్కొని.. ఒకసారిగా ఫోన్ కట్ చేసింది. అనంతరం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో కేశవ నాయక్ తాండాలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం పోలీసులకు తెలియడంతో ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన విద్యార్థినికి సమీప బంధువైన వరుసకు బాబాయ్ శీను నాయక్ తో పాటు చిన్న రేవల్లికి చెందిన శివ, మరికొందరు యువకులే ఈ ఘాతుకానికి కారణమంటూ విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు.
Also Read : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం… విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం
దీంతో విద్యార్థిని బంధువులు, తల్లిదండ్రులు వారి ఇళ్లపై దాడికి దిగారు. మరోవైపు చిన్న రేవల్లి గ్రామానికి చెందిన శివ టీవీ రిపేర్ షాప్ లో ఉన్న సామాగ్రిని బయటకు తెచ్చి అతని కారును సామాగ్రిని తగలబెట్టారు. దీంతో చిన్న రేవల్లి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా విద్యార్థిని మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు విద్యార్థిని ఆత్మహత్యపై ఆరోపణలు ఎదుర్కొంటున్న తన బాబాయ్ శీను నాయక్, శివ, మరికొందరు యువకులు కూడా పరారీలో ఉన్నారు. మరోవైపు విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందా? లేక హత్య? అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- డిసెంబర్ 7 నుంచి తెలంగాణలో ప్రజశాంతి పార్టీ అద్యక్షుడు కేఏ పాల్ పాదయాత్ర….
- గవర్నర్ లక్ష్యంగా అసెంబ్లీ సమావేశాలు….!!!???
- ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ఖాయమని జోస్యం చెప్పిన జగ్గారెడ్డి ….
- బీజేపీతో టచ్ లో ఉన్న టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు వీళ్లేనా?
- దళిత సిఎం హామీలాగే మునుగోడు అభివృద్ధి హామీ…. ట్విటర్ వేదికగా రాజగోపాల్ రెడ్డి
One Comment