
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడం ఖాయమని జోస్యం చెప్పారు. ఈ మేరకు బీజేపీ నుంచి ఇన్‌డైరెక్ట్‌గా సిగ్నల్స్ వచ్చాయని తెలిపారు. విచారణకు హాజరుకావాల్సిందిగా శుక్రవారం కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. లిక్కర్ స్కాం కేసులో వివరాలు తెలుసుకునేందుకు మాత్రమే విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో కవిత అరెస్ట్‌కు రంగం సిద్దమైందంటూ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతోన్నాయి.
Read Also : డైరెక్షన్ ఇవ్వటానికి మీరెవరు.. ఫాంహౌజ్ కేసులో సిట్ అధికారిపై కోర్టు సీరియస్
ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. కవితను అరెస్ట్ చేస్తామని బీజేపీ ఇన్‌డైరెక్ట్‌గా సిగ్నల్స్ ఇచ్చిందని, ఆమెను సీబీఐ అరెస్ట్ చేయబోతుందని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌ను అరెస్ట్ చేస్తే మరిన్ని విషయాలు బయటపడతాయని తెలిపారు. గత రెండు నెలలుగా ఎక్కడ చూసినా లిక్కర్ స్కాం, ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసు మాత్రమే కనిపిస్తోందన్నారు. కవిత, బీఎల్ సంతోష్‌లు ఇద్దరూ నిందితులేనని, ఇద్దరిని అరెస్ట్ చేయాల్సిందేనని చెప్పారు. కవిత, బీఎల్ సంతోష్‌లను వెంటనే అరెస్ట్ చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. బీఎల్ సంతోష్‌ను కాపాడుకునేందుకు జాతీయ, రాష్ట్ర బీజేపీ నేతలు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్, బీజేపీ రెండూ స్కాంలలో చిక్కుకున్నామని, ఆ రెండు స్కాంల ప్రభుత్వాలేనని విమర్శించారు. బీఎల్ సంతోష్ రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని, ఆయనను వెనుక నుంచి ప్రధాని మోదీ, అమిత్ షా నడిపిస్తున్నారని ఆరోపించారు.
Also Read : జగ్గారెడ్డిపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కోర్టులను అడ్డుపెట్టుకుని బీఎల్ సంతోష్ బయటపడాలని చూస్తున్నారని జగ్గారెడ్డి విమర్శించారు. లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ చేసుకోవాలని, తాను దేనికైనా సిద్దమంటూ కవిత గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని, కానీ ఆమె లోపల భయం కనిపిస్తుందని జగ్గారెడ్డి తెలిపారు. ఎవరికైనా భయం ఉంటుందని, కవిత కూడా భయపడుతుందని తెలిపారు. కవిత స్థానంలో తాను ఉన్నా భయపడతానని అన్నారు. కాంగ్రెస్ నేతలను కూడా ట్రాప్ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. లిక్కర్ స్కాం కేసులో టీఆర్ఎస్, ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో బీజేపీ చూస్తుంటే రెండు పార్టీలు అవినీతి పార్టీలేనని అర్థమవుతోందన్నారు. లిక్కర్ స్కాం, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రెండూ నిజమేనని జగ్గారెడ్డి తెలిపారు. బీజేపీ, టీఆర్ఎస్ నేతలు డ్రామాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 25 లక్షలకుపైగా మంది నిరుద్యోగుల ఉన్నారని, ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి :
- బీజేపీతో టచ్ లో ఉన్న టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు వీళ్లేనా?
- రాష్ట్రంలో దూసుకు పోతున్న ఈడి…. వెనుకబడిన సీట్….!
- దళిత సిఎం హామీలాగే మునుగోడు అభివృద్ధి హామీ…. ట్విటర్ వేదికగా రాజగోపాల్ రెడ్డి
- కేసీఆర్‌పై సమైక్యవాదులు కుట్రలు…. సంచలన వ్యాఖ్యలు చేసిన శాసనమండలి ఛైర్మన్ గుత్తా…
- అత్యాచారం కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పీఏ అరెస్ట్…. రిమాండ్‌కు తరలించిన హన్మకొండ పోలీసులు
2 Comments