

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేసినా మంత్రులు ఆ పని చేయలేక పోతున్నారు. ప్రస్తుతం మంత్రులను తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఐటీ, ఈడీ దాడులు వేధిస్తున్నాయి. ఎప్పుడూ ఎవరిపైన కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడిచేస్తాయి అన్నది అర్థం కాని పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఉన్నారు. టి ఆర్ ఎస్ వర్సెస్ బిజెపి ఆడుతున్న గేమ్ లో, సీఎం కేసీఆర్ కు ప్రధాని మోడీ కి మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం లో మంత్రులు పావులుగా మారారు. తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు సీఎం కేసీఆర్ వెళతారని అంతా భావించారు. అందుకు సన్నాహాలు కూడా చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు.
అయితే మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ మూడో సారి కూడా మళ్లీ అధికారంలోకి రావాలని, ముందస్తు కి వెళ్లే ప్రసక్తే లేదని, ఇప్పటి నుంచే ప్రజాక్షేత్రంలో ఉండాలని, మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని, ప్రజల మద్దతు కూడగట్టడం కోసం, ప్రజా సమస్యలను పరిష్కరించి ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. ఇక సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నియోజకవర్గాలపై ఫోకస్ చేద్దాం అనుకున్న మంత్రులను బిజెపి షాక్ ఇచ్చింది. వారి మైండ్ డైవర్ట్ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవి చంద్ర తదితరులపై ఈడీ, ఐటి దాడులతో ఒక్కసారిగా ఫోకస్ అంతా కేంద్ర దర్యాప్తు సంస్థ దాడుల మీదే ఉండేలా చేసింది. ఇక ప్రస్తుతం కెసిఆర్ కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఉన్నారని వెలుగులోకి వచ్చిన అంశాలతో మంత్రులకు ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
Also Read : ఎన్నికలకు ముందే మునుగోడు ఉపఎన్నికల హామీలను నెరవేర్చుతాం….కేటిఆర్ –
కవితను అరెస్ట్ చేసే దిశగా ప్రయత్నం జరుగుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. దీంతో ఎవరూ క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజల సమస్యలను పరిష్కరించటంపై దృష్టి పెట్టలేకపోతున్నారు. సీఎం కేసీఆర్ అనవసరంగా బీజేపీతో తలనొప్పి పెట్టుకున్నాడని కొంతమంది టీఆర్ఎస్ పార్టీ నేతలు లోలోపల మధనపడుతున్నారని సమాచారం. టిఆర్ఎస్ పార్టీలో ఆర్థికంగా బలోపేతంగా ఉన్న నాయకులు, తమపై ఎప్పుడు ఏం దాడులు జరుగుతాయో అన్న ఆందోళనలో వచ్చే ఎన్నికలు తర్వాత, ముందు తమ ఆస్తులను కాపాడుకోవటం ఎలా అన్న దానిపై దృష్టి పెడుతున్నారు. టిఆర్ఎస్ నాయకులకు మైండ్ డైవర్ట్ చేసేలా బిజెపి వ్యూహం ఫలించిందని తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది భావిస్తున్నారు. ఇక బీజేపీ ని ఇరకాటంలో పెట్టాలని టిఆర్ఎస్ పార్టీ ఎంత ప్రయత్నం చేస్తున్నా, అది అంత సక్సెస్ కావడం లేదని టాక్ వినిపిస్తుంది.
Read Also : పద్దతి మార్చుకోవాలి…. లేదంటే ప్రజాకోర్టులో శిక్ష తప్పదు –
ఎమ్మెల్యేల ఎర కేసులో బీజేపీ కీలక నాయకులను అరెస్ట్ చెయ్యాలని భావించినా సిట్ అధికారులకు అది సాధ్యం కావటం లేదు. ఇక బీజేపీ నాయకులను ఇరికించటంలో టీఆర్ఎస్ ఫెయిల్ అవుతుంది. బండి సంజయ్ పాదయాత్ర అడ్డుకోవడం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం విఫలయత్నం చేసినా, కోర్టు అనుమతితో బండి సంజయ్ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలను తెలుసుకొని, సీఎం కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారు. మరోవైపు వైఎస్ షర్మిల కూడా పాదయాత్ర చేస్తూ సీఎం కేసీఆర్ ను, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, మంత్రులను టార్గెట్ చేస్తూ ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగిస్తున్నారు. సీఎం కేసీఆర్ పై పోరాటంలో ప్రతి పక్షాలు బలంగా ముందుకు వెళుతుంటే, టిఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులపై తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఎన్నికల విషయాన్ని మరిచిపోయి ఐటీ, ఈడీ దాడుల గొడవలో పడిపోయారు.
ఇవి కూడా చదవండి :
- రేవంత్ రెడ్డికి హైకమాండ్ దిమ్మతిరిగే షాక్
- సిబీఐ విచారణకు హాజరైన మంత్రి గంగుల, ఎంపి రవిచంద్ర…
- గవర్నర్ తమిళి సైని కలిసిన షర్మిల…. కేసిఆర్ కుటుంబంపై సంచలన కామెంట్స్
- తోట దేవి ప్రసన్న ఆధ్వర్యంలో కదం తొక్కిన మహిళా కాంగ్రెస్
- నిజమైన క్రైమ్ మిర్రర్ కథనం.. రెవిన్యూ డివిజన్ గా చండూరు
4 Comments