
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : శమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గుజరాత్ ఎన్నికల తొలి దశ పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యింది. ఈ దశలో 19 జిల్లాల్లోని 89 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. దక్షిణ గుజరాత్, సౌరాష్ట్ర, కచ్ జిల్లాలు ఈ దశలో ఉన్నాయి. మొత్తం 788 మంది బరిలో నిలిచారు. తొలి దశలో మొత్తం 2,39,76,670 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 1,24,33,362 మంది పురుషులు, 1,15,42,811 మంది మహిళలు, 497 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు.
Read Also : వరంగల్ నగర పోలీస్ కమిషనర్‌గా ఏవి రంగనాధ్…. షర్మిలపై జరిగిన దాడి ప్రభావం
వీరి కోసం మొత్తం 25,434 పోలింగ్ బూత్‌లను ఈసీ ఏర్పాటు చేయగా ఇందులో 9,018 అర్బన్ ప్రాంతాల్లో, 16,416 పోలింగ్ బూత్‌లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. 34,324 ఈవీఎంలు, 34,324 కంట్రోల్ యూనిట్లు, 38,749 వీవీప్యాట్‌లను వినియోగిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పారామిలటరీ బలగాలను మోహరించినట్టు తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, ఆప్‌తో పాటు బీఎస్పీ, బీటీపీ, ఎంఐఎం, సీపీఎం, సీపీఐ, తదితర పార్టీలు, స్వతంత్రులు పోటీలో నిలిచారు. తొలి దశలో ఆప్ సీఎం అభ్యర్థి ఇసుదాన్ గధ్వీ, మాజీ మంత్రి పురుషోత్తం సోలంకి, ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కున్వార్జి బవలియా, మోర్బీ ‘హీరో’ కాంతిలాల్ అమృతీయ, క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా, ఆప్ గుజరాత్ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా వంటి ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
Also Read : ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో కీలక పరిణామం…. ముగ్గురు నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రం కావడంతో బీజేపీ ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వరుసగా ఏడోసారి గెలవాలని ఆ పార్టీ సర్వశక్తుల్ని ఒడ్డుతుంటే ఈసారి కాషాయ పార్టీ కంచుకోటను బద్దలుకొట్టి పునర్ వైభవం చాటుకోవాలన్న కసితో కాంగ్రెస్ శ్రేణులు అహర్నిశలూ శ్రమించాయి. మరోవైపు, చాపకింద నీరులా విస్తరించిన ఆప్ దూకుడు ప్రదర్శించింది. దీంతో ఇప్పటివరకు కేవలం బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే ప్రధాన పోటీ ఉండగా తాజాగా ఆప్ బరిలో నిలవడంతో ముక్కోణపు పోరు నెలకుంది.
ఇవి కూడా చదవండి :
- ఏ రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నా.. మోడీకి ముందు ఈడీ వస్తుంది… ఎంఎల్‌సి కవిత
- సీఎం కేసీఆర్ ఎక్కడ పోటీ చేస్తే.. నేను అక్కడే చేస్తా : తీన్మార్ మల్లన్న
- రెవిన్యూ డివిజన్ గా చండూరు.. రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు
- దళితబంధు పథకాన్నిప్రతిష్టాత్మకంగా తీసుకున్నటీఆర్ఎస్ ప్రభుత్వం
- వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌తో సీపీఐ పొత్తు… క్లారిటీ ఇచ్చిన కూనంనేని