క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : అంధత్వ రహిత తెలంగాణ’ లక్ష్యంలో భాగంగా సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు అమలుచేస్తున్న కంటివెలుగు విజయవంతానికి సర్వం సిద్ధం చేయాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయిస్తూ పాలనా అనుమతులు ఇచ్చిందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేయాలని, అవసరమైన వారికి ఉచితంగా కండ్లద్దాలు అందించాలని స్పష్టంచేశారు.
జనవరి 18న సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. నిర్వహించనున్నదని తెలిపారు. కంటి పరీక్షలు, అద్దాలు, మందులు ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా అందజేయనున్నట్టు తెలిపారు. 100 పనిదినాల్లో లక్ష్యం పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. గ్రామాల్లో క్యాంపులు నిర్వహించి కంటి పరీక్షలు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం 5 నెలల పాటు కొనసాగుతుందని వెల్లడించారు. 1.5 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ సారి 55 లక్షల మందికి కండ్లద్దాలు(30 లక్షలు రీడింగ్ గ్లాసెస్, 25 లక్షల ప్రిస్రిప్షన్ గ్లాసెస్) అవసరం అవుతాయని అంచనా వేస్తున్నట్టు చెప్పారు.
కార్యక్రమ పర్యవేక్షణకు రాష్ట్రస్థాయిలో 10, జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున క్వాలిటీ కంట్రోల్ టీమ్‌లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ‘ఐ స్రీనింగ్ ప్రోగ్రాం’గా ఇది నిలుస్తుందని, వారానికి 5 రోజులు(శని, అదివారాలు సెలవులు) పరీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. జనవరి 5న జిల్లా కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని, జనవరి 1 వరకు ఆటో రీఫ్రాక్టో మెషీన్లు, జనవరి 10 నాటికి 10-15 లక్షల రీడింగ్ గ్లాసెస్ సరఫరా చేస్తామని చెప్పారు.
అద్దాల బాక్స్ మీద బార్ కోడ్ ఉంటుందని, దాన్ని సాన్ చేయగానే లబ్ధిదారుల వివరాలు తెలిసేలా ఏరాట్లు చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదయ్యేలా అందరం కృషి చేద్దామని, దీన్ని విజయవంతం చేయాలని ప్రజాప్రతినిధులకు, సామాజిక కార్యకర్తలకు, పౌరులకు పిలుపునిచ్చారు.
One Comment