

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో బీజేపీ నేతల పాదయాత్ర అంటేనే కేసీఆర్ వెన్నులో వణుకు పుడుతోందని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి నిరాకరించి.., ఆయన్ను అరెస్టు చేయటం ద్వారా ఆ విషయం బహిర్గతమైందని అన్నారు. భయంతోనే అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ.. పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు.
Read Also : నల్లధనం దాచుకోవడానికి అనువైన ప్రదేశం చెప్పిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి…
తెలంగాణలో అధికార టీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యమ్నాయమన్న విషయాన్ని సీఎం కేసీఆర్ గ్రహించారని.., అందుకే తమ పార్టీ నేతల పాదయాత్రలకు దెబ్బకు ఆయన గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని వ్యాఖ్యానించారు. బైంసాలో పాదయాత్ర ప్రారంభిస్తే టీఆర్ఎస్తో పాటు కవల పార్టీ అయిన ఎంఐఎంకు వణుకు పుట్టిందని ఎద్దేవా చేశారు.సున్నితమైన, సమస్యాత్మక ప్రాతం కాబట్టే బైంసాలో పాదయాత్రకు అనుమతి నిరాకరించామని టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిందని.., అంటే ఇప్పటికీ అక్కడ శాంతియుత వాతవారణం నెలకొల్పటంలో కేసీఆర్ ప్రభుత్వం ఫెయిల్ అయినట్లు ఒప్పుకోవటం కాక మరేంటి ? అని విజయశాంతి ప్రశ్నించింది.
Also Read : శబరిమల ఆలయానికి రికార్డుస్థాయిలో ఆదాయం… పది రోజుల్లోనే రూ. 53.57 కోట్ల ఆదాయం…
ప్రభుత్వం ఎన్ని విధాలుగా ప్రయత్నించినా.., పాదయాత్ర చేసి తీరుతామని చెప్పారు. తమ పాదయాత్రతో సీఎం కేసీఆర్ కంటిమీద కునుకు లేకుండా చేస్తామని విజయశాంతి వ్యాఖ్యనించారు.బండి సంజయ్ పాదయాత్రకు నిర్మల్ జిల్లా పోలీసులు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. అనుమతి నిరాకరణపై బీజేపీ నేతలు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు… పాదయాత్రలు, ర్యాలీలు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, వాటికి అనుమతి నిరాకరించడం సరికాదని స్పష్టం చేసింది.
Read Also : హయత్ నగర్ పరిధిలోని అన్నారంలో దారుణం… పదో తరగతి విద్యార్థినిపై తోటి విద్యార్థుల గ్యాంగ్ రేప్…
కొన్ని షరతులతో పాదయాత్రకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. భైంసా పట్టణంలోకి వెళ్లకుండా పాదయాత్ర కొనసాగించాలని, భైంసా పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలోనే సభ నిర్వహించాలని హైకోర్టు సూచించింది. సభలో విద్వేషపూరిత ప్రసంగాలు, నినాదాలు చేయవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. సంజయ్ పాదయాత్రకు పోలీసులు తప్పకుండా సహకరించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి :
- హైదరాబాద్ నగరంలో మరో భారీ స్కామ్…. వత్తులు, బొట్టు బిళ్లల తయారీ పేరుతో రూ. 200 కోట్ల టోకరా.
- షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత… కారవాన్ కు నిప్పు, రాళ్ళతో దాడి.
- ఏపీ హోంగార్డులకు ప్రభుత్వం శుభవార్త…. కానిస్టేబుల్ పోస్టుల్లో రిజర్వేషన్లు కల్పన.
- రిపబ్లిక్ వేడుకలకు చీఫ్ గెస్ట్‌గా ఈజిప్టు అధ్యక్షుడు.
One Comment