

క్రైమ్ మిర్రర్, సినిమా డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరో, దివంగత నందమూరి తారకరామారావు కుమారుడు, నటసింహం నందమూరి బాలయ్య తనయుడు మోక్షజ్ఞ తారకరామ సినిమాల్లోకి ఎంట్రీపై ఎన్నాళ్లుగానో చర్చలు నడుస్తున్నాయి. అతడు సినిమాల్లో నటించడంపై నందమూరి అభిమానులు కూడా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ ఆశలను నిజం చేస్తూ బాలయ్య .. తన కొడుకు ఎంట్రీపై ఓ అప్డేట్ ఇచ్చేశాడు. మోక్షజ్ఞ సినిమా అరంగేట్రం వచ్చే ఏడాది ఉంటుందని చెప్పాడు. మోక్షజ్ఞ బర్త్ డే వేడుకలను బాలయ్య ఘనంగా నిర్వహించాడు.
Read More : కన్ను పడితే ఖబ్జా…! మునగనూర్ మాజీ సర్పంచ్ భర్త శ్రీనివాస్‌గౌడ్ లీలలు
ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ తన కుమారుడి ఎంట్రీపై సమాధానమిచ్చాడు. అతను సినిమాల్లోకి వచ్చే ఏడాది వస్తున్నాడని వెల్లడించాడు. అయితే, ఎవరి దర్శకత్వంలో అతడు సినిమా చేస్తాడన్నదానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అంతా దైవేచ్చ అని మాత్రం బాలయ్య చెప్పుకొచ్చాడు. కానీ, సినీ ఇండస్ర్టీ వర్గాల ప్రకారం.. బాలయ్యకు ఎంతో ఇష్టమైన ప్రముఖ దర్శకుడు బోయపాటి డైరెక్షన్లో తన కొడుకును వెండితెరకు పరిచయం చేస్తాడన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. గతంలో బాలయ్య సూపర్‌హిట్ సినిమా ఆదిత్య 369కు సీక్వెల్‌గా తీయబోయే సినిమాతో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని సమాచారం. ఇందులో బాలయ్య కూడా ప్రధాన పాత్ర పోషిస్తాడని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి …
One Comment