

హైదరాబాద్: చక్కటి అందం.. అందుకు తగ్గ ప్రతిభ..సహజమైన నటనతో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేయగల నటి సాయి పల్లవి. వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుంటూ, విభిన్నమైన సినిమాలతో ముందుకెళ్లడంలో ఈ బ్యూటీని మించినవారు లేరనడంలో అతిశయోక్తి కాదేమో! గ్లామర్ షోకు దూరంగా ఉంటూ, తనదైన అభినయంతో అటు కోలీవుడ్, మాలీవుడ్, ఇటు టాలీవుడ్ పరిశ్రమంలో చెరగని ముద్ర వేసుకున్న సాయి పల్లవి షాకింగ్ నిర్ణయం తీసుకుందన్న వార్త ఒకటి ఇప్పుడు ఆమె అభిమానులను కలవరపెడుతోంది. ఇకనుంచి ఆమె సినిమాలకు గుడ్‌బై చెప్పనుందన్న వార్త గుప్పుమంటోంది. ఈ మధ్య టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానాతో కలిసి విరాటపర్వం అనే సినిమాలో నటించింది.
Read More : పీసీఆర్ సీఐ రాజుపై సస్పెన్షన్ వేటు… మరో మహిళతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన సీఐ
ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ మూవీ గార్గిలో ప్రధాన పాత్రలో కనిపించింది. ఈ రెండు సినిమాల తర్వాత సాయి పల్లవి మరో సినిమాను ఒప్పుకోలేదట. కొన్ని రోజులుగా ఆమెకు సినిమా ఆఫర్లు వస్తున్నా వాటిని తిరస్కరిస్తోందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. కొందరు స్టార్ హీరోల సరసన నటించేందుకు అవకాశాలు వచ్చినా ఆమె ఎందుకో నో చెబుతోందంట. దీంతో ఆమెకు సడెన్‌గా ఏమైందన్న టెన్షన్ సాయి పల్లవి అభిమానుల్లో మొదలైంది. అయితే, ఈ లేడీ సూపర్‌స్టార్ ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం వెనక ఓ బలమైన కారణం ఉందన్న న్యూస్ ఒకటి సినిమా వర్గాల్లో జోరందుకుంది. సాయి పల్లవి డాక్టర్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. జార్జియాలో వైద్య విద్యను అభ్యసించిన ఆమె.. భారత్‌కు తిరిగిచ్చాక తనకున్న ఆసక్తి కారణంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
Read More : ముందస్తు ఎన్నికల మూడ్ లోకి కేసిఆర్….. డిసెంబర్ నెలలో వరస బహిరంగ సభలు
ఇప్పుడు తాను అనుకున్న విధంగా సినిమాల్లోనూ తనదైన మార్క్‌ను వేసిన ఆమె.. ఇకనుంచి తాను నేర్చుకున్న డాక్టర్ ప్రొఫెషన్‌కు న్యాయం చేయాలని అనుకుంటోందట. అందుకు తగ్గట్టుగానే కోయంబత్తూరులో సొంతంగా ఆస్పత్రిని కూడా నిర్మిస్తోందని తెలుస్తోంది. ఆ హాస్పిటల్‌ను సాయి పల్లవితో పాటు ఆమె చెల్లెలు పూజ చూసుకుంటారట. అందుకే సినిమాల నుంచి తప్పుకోవాలని సాయి పల్లవి నిర్ణయించుకుందని టాక్.
ఇవి కూడా చదవండి …
- కారులో మరో మహిళతో రాసలీలలు చేస్తూ భార్యకు దొరికిన సీఐ సస్పెండ్
- ఉద్యోగులుగా చేరి.. గుట్టంతా తెలుసుకుని.. మల్లారెడ్డిపై ఐటీ అధికారుల పక్కా స్కెచ్
- టిడిపికి పూర్వ వైభవం సాధ్యమేనా?.. టిఆర్ఎస్ లో ఇమడ లేక పోతున్న మాజీ టిడిపి నేతలు..
- జర్నలిస్టుల కల ఇప్పట్లో నెరవేరదా?
- ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో సిట్ దూకుడు… విచారణకు రావాలంటూ ఎంపీ రఘురామకు నోటీసులు
One Comment