
- ప్రభుత్వం ఇచ్చింది 100 గజాలు.. 600 గజాల్లో ఇళ్లు నిర్మాణం..
- కనీస అనుమతులు లేకుండానే భారీ కమర్షియల్ భవనం నిర్మాణం
- నకిలీ పత్రాలు సృష్టించి…ఇప్పటికే భారీగా ప్రభుత్వ భూముల అమ్మకం
- తాజాగా రూ.150 కోట్లకుపైగా విలువ చేసే మరో 8 ఎకరాలు కాజేసేందుకు యత్నం…
క్రైమ్ మిర్రర్, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: కంచే చేను మేసినట్లుగా ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన ప్రజాప్రతినిదే యదేచ్ఛగా ఖబ్జాలకు పాల్పడుతున్నాడు. తన భార్య సర్పంచ్ పదవిని అడ్డుపెట్టుకోని అడ్డగోలుగా ప్రభుత్వ భూములు కొల్లగొట్టారు. అంతేకాదు నకిలీ పత్రాలు సృష్టించి, వాటిలో రాత్రికి రాత్రే నిర్మాణాలు చేపట్టి, అప్పటి గ్రామ పంచాయతీ నుంచి ఇంటి నంబర్లు తీసుకుని, వాటిని ఇతరులకు విక్రయించి భారీగా సొమ్ము చేసుకున్నాడు. ఓ మాజీ ఎమ్మెల్యే…మరో కీలక ప్రజాప్రతినిధి సహకారం కూడా పుష్కలంగా లభిస్తుండటంతో ఆయన ఖబ్జాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది.
Read More : రాళ్లు, పెట్రోలు ప్యాకెట్లతో పలువురు… జర్నలిస్టులపై భూకబ్జాదారుల దాడి
సర్పంచ్ పదవిని అడ్డుపెట్టుకుని : హయత్‌నగర్ మండలం మునగనూర్‌లోని సర్వే నంబర్ 38లో సుమారు 66 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇరువై ఏళ్ల క్రితం వీకర్స్ సెక్షన్ కింద సుమారు 200 మంది పేదలకు అప్పటి ప్రభుత్వం ఒక్కో వ్యక్తికి వంద గజాల స్థలాన్ని ఇచ్చింది. అయితే 2013–18 మధ్య కాలంలో ఓ మహిళా సర్పంచ్‌గా పని చేసింది. భార్య చేతిలో ఉన్న అధికారాన్ని ఆమె భర్త నక్క శ్రీనివాస్‌గౌడ్ అడ్డుపెట్టుకుని యధేచ్ఛగా భూ ఖబ్జాలకు పాల్పడ్డాడు. వీకర్స్ సెక్షన్ కింద ప్రభుత్వం ఆయనకు అప్పట్లో 100 గజాల స్థలం ఇస్తే..ఆ తర్వాత తన భార్య పదవిని అడ్డుపెట్టుకుని అదే స్థలానికి ఆనుకుని ఉన్న మరో 500 గజాల ప్రభుత్వ భూమిని ఖబ్జా చేశారు. ఖబ్జాకోరు భార్య అప్పటికే సర్పంచ్‌గా కొనసాగుతుండటంతో అప్పటి అధికారులు కూడా పెద్దగా అడ్డు చెప్పలేదు. ప్రభుత్వ సంస్థల నుంచి కనీస అనుమతులు కూడా తీసుకోకుండా 600 గజాల విస్త్రీర్ణంలో భారీ కమర్షియల్ బిల్డింగ్‌ను నిర్మించాడు. కళ్లముందే ప్రభుత్వ భూమి ఖబ్జా అవుతున్నా.. రాత్రికి రాత్రే వాటిలో భారీ అక్రమ నిర్మాణలు వెలుస్తున్నా.. రెవిన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులు కిమ్మనకపోవడం గమనార్హం.
Read More : అర్హత గల ప్రతి ఒక్కరూ తమ ఓటు నమోదు చేసుకోవాలి… జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
తాజాగా మరో ఎనిమిది ఎకరాలపై కన్ను : ఇప్పటికే నకిలీ ప్రొసిడ్స్‌తో ప్రభుత్వ భూములను పెద్ద సంఖ్యలో కొల్లగొట్టిన మాజీ సర్పంచ్ భర్త శ్రీనివాస్‌గౌడ్ తాజాగా ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఇదే సర్వే నంబర్‌లోని మరో 8 ఎకరాల ప్రభుత్వ భూమిపై కన్నేశాడు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ భూమిని అమ్మడం, కొనడం నేరం. కానీ సర్పంచ్ భర్త తనకున్న రాజకీయ పలుకుబడితో రూ.150 కోట్లకుపైగా వి లువ చేసే ఈ భూమిని ఎలాగైనా దక్కించుకోవాలని కుట్రపన్నాడు. వీటికి నకిలీ పత్రాలు సృష్టించి, ఇటు ప్రభుత్వాన్ని, అటు కోర్టులను తప్ప దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు.
Read More : శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో రైలు
జర్నలిస్టుల భూములు ఖబ్జా : ఇదిలా ఉంటే ప్రభుత్వం ఇదే సర్వే నంబర్‌లోని మూడున్నర ఎకరాలకుపైగా భూమిని 2009లో అప్పటి ప్రభుత్వం వీకర్స్ సెక్షన్ కింద జర్నలిస్టులకు కేటాయించింది. ఆ మేరకు అప్పట్లోనే 204 ప్లాట్లు చేసి, ఎంపిక చేసిన లబ్దిదారులకు ప్రొసిడింగ్స్ కూడా జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన ఈ స్థలంలో సొంతంగా ఓ గూడు కట్టుకునేందుకు ఆయా లబ్దిదారులంతా పైసాపైసా పోగేసి నిర్మాణాలు చేపట్టగా రాత్రికి రాత్రే వాటిని కూల్చివేయించాడు. కూల్చి వేసిన వాటి స్థానంలో మళ్లీ నిర్మాణాలు చేపట్టేందుకు యత్నించిన లబ్ధిదారులపై భౌతిక దాడులకు పాల్పడుతున్నాడు. ఆయనపై హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఇప్పటికే ప్రభుత్వ భూముల ఖబ్జా సహా ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ, ఇతర కేసులు కూడా నమోదయ్యాయి. ప్రభుత్వ భూములను కాజేస్తూ.. లబ్దిదారులపై దాడులకు పాల్పడుతున్న మాజీ సర్పంచ్ భర్త నక్క శ్రీనివాస్‌గౌడ్ సహా ఆయన బంధువులు, అనుచరులను వెంటనే అరెస్ట్ చేసి, జై లుకు పంపాలని జర్నలిస్టు సంఘా లు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి …
- యాదాద్రి సాక్షిగా కేటీఆర్ ఇజ్జత్ తీసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే
- సాయి పల్లవి సినిమాలకు గుడ్‌బై చెప్పనుందా..?
- కారులో మరో మహిళతో రాసలీలలు చేస్తూ భార్యకు దొరికిన సీఐ సస్పెండ్
- ఉద్యోగులుగా చేరి.. గుట్టంతా తెలుసుకుని.. మల్లారెడ్డిపై ఐటీ అధికారుల పక్కా స్కెచ్
- టిడిపికి పూర్వ వైభవం సాధ్యమేనా?.. టిఆర్ఎస్ లో ఇమడ లేక పోతున్న మాజీ టిడిపి నేతలు..
4 Comments