
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రోజూ ఏదోక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నోటీసుల పరంపర కొనసాగిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో నిందితులతో లింక్ ఉన్న చాలామంది వ్యక్తులకు నోటీసులు జారీ చేయగా శుక్రవారం ఒకేసారి మరో ఐదుగురికి నోటీసులు జారీ చేసింది. శుక్రవారం జగ్గుస్వామి సోదరుడు మణిలాల్‌తో పాటు అతని దగ్గర పర్సనల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న శరత్, ప్రశాంత్, విమల్ అనే వ్యక్తులకు సిట్ నోటీసులు ఇచ్చింది. అలాగే జగ్గు స్వామి పనిచేస్తున్న అమృత హాస్పిటల్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఎస్ఓ) ప్రతాపన్ అనే వ్యక్తికి కూడా సిట్ శుక్రవారం నోటీసులిచ్చింది.
Read Also : చైనాలో మరోసారి కరోనా విజ్రంభన… పలు నగరాల్లో లాక్ డౌన్లు, ఆంక్షలు…
వీరందరికి 41ఏ సిఆర్పీసీ సెక్షన్ కింద నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. విచారణకు గైర్హాజరు అయితే 41ఏ(3),(4) సీఆర్పీసీ కింద అరెస్టు చేస్తామని హెచ్చరించింది. గతంలో జగ్గు స్వామికి ఈ కేసులో నోటీసులు ఇవ్వగా ఆయన విచారణకు హాజరు కాలేదు. దీంతో ఆయనకు సిట్ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. గతంలో జగ్గుస్వామికి నోటీసులు ఇచ్చేందుకు కేరళకు హైదరాబాద్ నుంచి సిట్ పోలీసులు వెళ్లారు. కానీ ఆయన ఆచూకీ దొరక్కపోవడంతో ఆయన ఆశ్రమంలోని సిబ్బందికి నోటీసులు ఇచ్చారు. అయినా జగ్గుస్వామి విచారణకు డుమ్మా కొట్టడంతో కోర్టు అనుమతితో ఆయనకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
Also Read : డిసెంబర్ నెలలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు…!!!
అయినా కూడా ఆయన స్పందించకపోవడంతో ఇప్పుడు ఆయన సన్నిహితులకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుకి సిట్ నోటీసులు అందించడం బిగ్ ట్విస్ట్‌గా చెప్పుకోవచ్చు. ఈ కేసులో ఆయన చిక్కుకుంటారనేది ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు ఏపీకి చెందిన రఘురామకృష్ణం రాజు ఈ కేసులో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది. కానీ తనకు ఎలాంటి నోటీసులు అందలేదని రఘురామకృష్ణంరాజు చెబుతున్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న హైదరాబాద్‌కి చెందిన నందగోపాల్‌లో రఘురామకృష్ణంరాజు కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Read Also : నేడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్న మర్రి శశిధర్ రెడ్డి, రామారావు పటేల్….
అయితే నందగోపాల్ ఎవరో తనకు తెలియదని రాఘురామకృష్ణంరాజు చెబుతున్నారు. కాగా బుధవారం ఈ కేసులో నందకుమార్ భార్య చిత్రలేఖతో పాటు అంబర్‌పేట లాయర్ ప్రతాప్ గౌడ్‌కు సిట్ నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచింది. ఇలా ఈ కేసులో వరుస పెట్టి సిట్ నోటీసులు పర్వం కొనసాగిస్తోంది. దీంతో రానున్న రోజుల్లో ఈ కేసులో ఇంకెంతమందికి సిట్ నోటీసులు అందిస్తుందనేది హాట్‌టాపిక్‌గా మారిందని చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి :
- నిఘా నీడలో గులాబీ నేతలు.. ఎవర్నీ వదిలేది లేదంటున్న ఐటీ అధికారులు
- లారీ ఢీకొని కోడి మృతి…. ఆందోళనకు దిగిన గ్రామస్థులు… ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జామ్
- ఈడీ, ఐటీ సోదాలు… టీఆర్ఎస్, బీజేపీ కలిసి ఆడుతున్న నాటకాలు : ప్రవీణ్ కుమార్
- ఈనెల 28 నుండి ఐదో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర….
- మంత్రి మల్లారెడ్డిపై బోయిన్ పల్లి పీఎస్ లో కేసు నమోదు….
One Comment