
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ చాకచక్యంతో 42మంది ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. రన్నింగ్ బస్సులో డ్రైవర్‌కు గుండెపోటు వచ్చినా.. ఆ నొప్పిని పంటి బిగువున భరిస్తూనే సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. బస్సును జాగ్రత్తగా రోడ్డు పక్కన ఆపి అయ్యప్ప స్వాముల ప్రాణాలు కాపాడాడు. చివరికి తాను ప్రాణాలు కోల్పోయాడు. నెల్లూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ నెల 16న కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడకు చెందిన 42మంది అయ్యప్ప స్వాములు శబరిమల టూర్ ప్లాన్ చేసుకున్నారు.
Read Also : డిసెంబర్ నెలలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు…!!!
వీరు ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో శబరిమల వెళ్లారు.. అక్కడి నుంచి బయలుదేరి తిరుగు ప్రయాణంలో గురువారం సాయంత్రం నెల్లూరు జిల్లా వరకు వచ్చారు. ఈ క్రమంలో బోగోలు మండలంలోని కడనూతల చెరువు దగ్గరకు వచ్చేసరికి బస్సు డ్రైవర్ భాస్కర్‌రావుకు గుండెలో నొప్పి వచ్చింది. డ్రైవర్ భాస్కర్ రావు ఆ నొప్పిని భరిస్తూ బస్సును కొంతదూరం నడిపారు. కానీ అక్కడ ఫ్లైఓవర్ పైకి వెళ్లాక ఇక నొప్పిని భరించలేక పోయారు. వెంటనే చాకచక్యంగా వ్యవహరించి.. బస్సును రోడ్డు పక్కన ఆపాడు.
Also Read : నేడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్న మర్రి శశిధర్ రెడ్డి, రామారావు పటేల్….
భాస్కరరావు వెనుక సీటులో పడుకుని సేదతీరేందుకు ప్రయత్నిస్తుండగా బస్సులోని స్వాములు గమనించారు. వారు దగ్గరకు వెళ్లి పలకరించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. ‘ఓ పక్క ప్రాణాలు పోతున్నా సరే.. మమ్మల్ని కాపాడావా స్వామీ’ అంటూ వారు కంటతడి పెట్టారు. మరో డ్రైవర్ సాయంతో బస్సును అక్కడి నుంచి తీసుకెళ్లారు. డ్రైవర్ భాస్కర్‌రావు మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైన విశాఖపట్నం జిల్లా కె.కోటపాడు మండలం, ఎ.కోడూరుకు అంబులెన్స్‌లో పంపారు.
Read Also : నిఘా నీడలో గులాబీ నేతలు.. ఎవర్నీ వదిలేది లేదంటున్న ఐటీ అధికారులు
ఓ వైపు గుండెలో తీవ్రమైన నొప్పి.. భరించలేని బాధను సైతం తట్టుకుని బస్సును రోడ్డు పక్కకు తీసుకెళ్లారు భాస్కర్ రావు. 42 మంది అయ్యప్ప స్వాములకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చాకచక్యంగా వ్యవహరించారు. ఆ తర్వాత ఆయన చనిపోయారు. భాస్కరరావు చేసిన సాహసాన్ని అయ్యప్ప స్వాములు కొనియాడారు. రియల్ హీరో అంటూ ప్రశంసలు కురిపించారు.
ఇవి కూడా చదవండి :
- హిందువుగా వేషం వేసి బురిడి కొట్టిస్తున్న ఐసిస్ ఉగ్రవాది!
- 40 సీట్లు గెలిస్తే పవనే సీఎం.. ఏపీలో బీజేపీ స్కెచ్ అదుర్స్
- హిందువుగా వేషం వేసి బురిడి కొట్టిస్తున్న ఐసిస్ ఉగ్రవాది!
- ఈడీ, ఐటీ సోదాలు… టీఆర్ఎస్, బీజేపీ కలిసి ఆడుతున్న నాటకాలు : ప్రవీణ్ కుమార్