Telangana

మల్లారెడ్డి విద్యాసంస్థల్లో భారీగా అక్రమాలు గుర్తించిన ఐటీ శాఖ

క్రైమ్ మిర్రర్  ఆన్ లైన్  డెస్క్ : మల్లారెడ్డి విద్యాసంస్థల్లో అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించామని.. ఐటీ (ఇన్‌కమ్ ట్యాక్స్) అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ రాయితీలతో సొసైటీ కింద నడుస్తున్న మల్లారెడ్డి విద్యాసంస్థల్లో.. నిర్దేశించిన ఫీజు కంటే ఎక్కువ వసూలు చేసినట్టు గుర్తించామని చెప్పారు. అదనంగా వసూలు చేసిన ఫీజులను నగదు రూపంలో తీసుకున్నట్టు ఆధారాలు సేకరించినట్టు సమాచారం.

Read Also  : ఎం‌ఎల్‌ఏల కొనుగోలు కేసు…. మరో ఇద్దరికీ నోటీసులు

లెక్కల్లో చూపకుండా నగదు రూపంలో వసూలు చేసిన మొత్తాలను.. స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం తోపాటు.. మల్లారెడ్డి-నారాయణ ఆసుపత్రి కోసం ఖర్చు చేసినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. అటు, ఇప్పటివరకు మంత్రి మల్లారెడ్డి నివాసం, కార్యాలయాలు, బంధులువుల ఇళ్లలో చేసిన సోదాల్లో రూ.6కోట్ల నగదు, భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నట్టు ఐటీ ఆఫీసర్లు చెబుతున్నారు.

Also Read : మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి ఛాతినొప్పి…. ఆసుపత్రికి తరలింపు

హైదరాబాద్‌ రీజియన్‌ పరిధిలోని ఐటీ అధికారుల తోపాటు.. కర్ణాటక, ఒడిశా నుంచి వచ్చిన 400 మందికి పైగా ఐటీ అధికారులు 65 బృందాలుగా విడిపోయి సోదాలు చేశారు. కొన్ని చోట్ల సోదాలు ముగిసినా.. మరికొన్ని చోట్ల కొనసాగుతున్నాయి. గురువారం కూడా సోదాలు జరిగే అవకాశం ఉంది. మల్లారెడ్డి  వియ్యంకుడు వర్ధమాన కళాశాలలో డైరెక్టర్‌గా ఉండటంతో.. అక్కడ కూడా సోదాలు చేసినట్టు తెలుస్తోంది.

Read Also : మంత్రి మల్లారెడ్డి బంధువుల ఇళ్లలో నోట్ల కట్టలు?

అయితే.. ఈ సోదాలు, దాడులపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. తమ వ్యాపారాలకు సంబంధించిన అన్ని లెక్కలు సరిగ్గానే ఉన్నాయని స్పష్టం చేశారు. విద్యా సంస్థలు, ఆసుపత్రులు, ఆస్తుల వివరాలను ఐటీ అధికారులకు ఇచ్చామని.. అధికారులు ఇంకా సోదాలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. వారికి అన్ని విధాలా సహకరిస్తున్నామని స్పష్టం చేశారు. తన కుటుంబసభ్యులకు ఎలాంటి సమస్య లేదని.. అధికారులు కోరిన విధంగా సహకరిస్తున్నామని మంత్రి మల్లారెడ్డి చెప్పారు.

ఇవి కూడా చదవండి : 

  1. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
  2. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పీఏ కుమారుడు సూసైడ్… కారణం అదేనా?
  3. 40 సీట్లు గెలిస్తే పవనే సీఎం.. ఏపీలో బీజేపీ స్కెచ్ అదుర్స్
  4. ప్రైవేట్ జెట్ లో వంద కోట్ల రూపాయలు తరలింపు? లిక్కర్ స్కాంలో కవితకు బిగిస్తున్న ఉచ్చు?

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.