National

హిందువుగా వేషం వేసి బురిడి కొట్టిస్తున్న ఐసిస్ ఉగ్ర‌వాది!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తాజాగా క‌ర్ణాట‌క‌లోని మంగుళూరులో జ‌రిగిన ఆటో పేలుడు కేసులో బ‌తికి ప‌ట్టుబ‌డ్డ ప్ర‌ధాన నిందితుడు మహ‌మ్మ‌త్ ష‌రీక్ గురించి ఒక్కో విష‌యం వెలుగులోకి వ‌స్తున్నాయి. ఈయ‌న బ‌ళ్లారిలో నివ‌సించే ఓ హిందూ ఐడెంటిటీ కార్డును సంపాదించి మైసూరులో జ‌రిగిన అన్ని హిందూ పండుగ‌ల‌కు త‌ప్ప‌నిస‌రిగా హాజ‌రై హిందూగా చ‌లామ‌ణీ అయ్యేవాడు. దీంతోపాటు ఎవ‌రికి అనుమానం రాకుండా మెడ‌లో శివుని ప్ర‌తిమ‌ను కూడా ధ‌రించేవాడంట‌.

Also Read : మంత్రి మల్లారెడ్డిపై బోయిన్ పల్లి పీఎస్‌ లో కేసు నమోదు..

కాషాయ వ‌స్తాలు కూడా ధ‌రించి హిందూలా క‌ల‌రింగ్ ఇచ్చేవాడ‌ని ద‌ర్యాప్తులో తేలింది. హిందూగా మారి మ‌త‌క‌ల్లోల్లాలు సృషించాల‌నేది ఈ ప్లాన్‌గా పోలీసులు చెబుతున్నారు. ప్రేమ్ రాజ్ హుటాగి పేరుతో ఓ ఆధార్ కార్డు కూడా సంపాదించాడని వారు చెప్పారు.

Also Read : ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో సిట్ దూకుడు… విచారణకు రావాలంటూ ఎంపీ రఘురామకు నోటీసులు

ఈయ‌న 2020 లో జరిగిన ఓ కేసుకు సంబంధించి అరెస్టయి జైలుకెళ్లి ..హైకోర్టు ఆదేశాలపై బెయిలుపై విడుద‌ల‌య్యాడు. కన్యాకుమారి, కోచ్చి, కోయంబత్తూరు, మైసూరు వంటి చోట్ల దాక్కుంటూ ఉండేవాడ‌ని కర్ణాటక హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర షరీక్ తెలిపారు. ఈ ఘ‌ట‌నలో గాయ‌ప‌డిన ఈయ‌న ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇతనికి 40 శాతం గాయాలయ్యాయి.

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.