Telangana

తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న దర్యాప్తు సంస్థల హవా…

ఒకవైపు ఈడీ.... మరోవైపు ఐటి

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో దర్యాప్తు సంస్థల హవా కొనసాగుతుంది. ఓవైపు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సిట్ దర్యాప్తు కొనసాగుతుండగానే మరోవైపు ఐటీ (ఇన్‌కం ట్యాక్స్) ఎంట్రీ ఇచ్చింది. దీంతో దర్యాప్తు సంస్థలకు రాజకీయ రంగు పులుముతున్నారు. మంత్రి మల్లారెడ్డికి చెందిన ఆఫీసులు, సంస్థల్లో ఐటీ రెయిడ్స్ చేస్తుంటే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని టీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. తమ పార్టీ నేతలను  పార్టీ మరాలని ఒత్తడి తీసుకొస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అటు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తమను కావాలని టార్గెట్ చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు.

Read Also : ఎం‌ఎల్‌ఏల కొనుగోలు కేసు…. మరో ఇద్దరికీ నోటీసులు

అయితే నోటీసులు ఇచ్చినా ఎందుకు సిట్ ముందుకు రావడం లేదని టీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. ఎందుకు భయపడుతున్నారని నిలదీస్తోంది. సిట్ చట్టబద్ధంగానే ఫాం అయ్యిందని చెబుతోంది. దీనికి బీజేపీ గట్టి సమాధానం ఇచ్చింది. అసలు బీఎల్ సంతోష్‌కు నోటీస్ అందలేదని రఘునందన్ రావు స్పష్టం చేశారు. ఆయన కార్యాలయంలో పనిచేసే హేమచందర్ అనే వ్యక్తికి సర్వ్ చేశారని చెప్పారు. అయితే మెయిల్ ద్వారా నోటీస్ ఇవ్వాలని కోర్టు చెప్పినట్టు ఆయన వెల్లడించారు. నోటీసులు అందగానే కచ్చితంగా హాజరవుతారని చెప్పారు. అటు ఐటీ.. ఇటు సిట్ దర్యాప్తుపై కాంగ్రెస్ నేత మహేశ్‌కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్ని దాడులు చేసి కేవలం రూ.99 వేల కోట్లు మాత్రమే స్వాధీనం చేసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read : మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి ఛాతినొప్పి…. ఆసుపత్రికి తరలింపు

ఈ దాడులు కేవలం రాజకీయ డ్రామా అని కొట్టిపారేశారు. కేసీఆర్ కూతురు కవితకు సీబీఐ నోటీసులు వస్తాయని వాటిని ఆపడానికే తెలంగాణ ప్రభుత్వం సిట్ ఎర్పాటు చేసిందని మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. ఎన్నికల వరకు ఈ స్టంట్ నడుస్తుందని, ఆ తర్వాత టీఆర్ఎస్-బీజేపీ అలయ్ బలయ్ చేసుకుంటాయని మహేశ్ ఆరోపించారు. రాజకీయంగా ఎలాంటి ఆరోపణలు ఉన్నా ఆర్థికరంగ నిపుణులు ఐటీ దాడులపై కీలక విషయాలు చెప్పారు. మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన కార్యాలయాల్లో దాడుల సందర్భంగా తమపై దాడి చేశారని, కొట్టారని ఆయన కుటుంబసభ్యులు ఆరోపణలు చేశారు. అయితే ఐటీ అధికారులు కొడితే తప్పేనని ఆర్థికరంగ నిపుణులు సాయిబాబ స్పష్టం చేశారు. అదే సమయంలో దర్యాప్తు సంస్థలను ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని హితవు పలికారు. తెలంగాణలో చట్టబద్ధంగానే ఐటీ దాడులు జరుగుతున్నాయని.. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పష్టం చేశారు. మొత్తానికి అటు సిట్, ఇటు ఐటీ దాడులు తెలంగాణ రాజకీయాలను వేడెక్కించాయి.

ఇవి కూడా చదవండి : 

  1. మంత్రి మల్లారెడ్డి బంధువుల ఇళ్లలో నోట్ల కట్టలు?
  2. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు…..
  3. వచ్చే నెల నుంచి అన్నదాత క్లోజ్.. రామోజీ నిర్ణయంతో పాఠకుల షాక్
  4. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పీఏ కుమారుడు సూసైడ్… కారణం అదేనా?
  5. 40 సీట్లు గెలిస్తే పవనే సీఎం.. ఏపీలో బీజేపీ స్కెచ్ అదుర్స్

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.