
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : రెండు రోజులపాటు మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటి అధికారులు సోదాలు నిర్వహించగ భారీగా నగదు పట్టుబడిందని వార్తలు వచ్చాయి. అయితే.. దాడుల సమయంలో ఆయన అధికారులకు అడ్డు తగిలారని ఐటీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే మంత్రిపై కేసు నమోదైంది. దాడుల నేపథ్యంలో మల్లారెడ్డిపై ఐటీ అధికారులు బోయిన్ పల్లి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. 342, 353, 201, 203, 504, 506, 353, 379 ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Also : మల్లారెడ్డి విద్యాసంస్థల్లో భారీగా అక్రమాలు గుర్తించిన ఐటీ శాఖ
డ్యూటీలో ఉన్న అధికారుల విధులకు ఆటంకం కల్పించారని ఫిర్యాదులో పేర్కొన్నారు అధికారులు. సోదాల్లో సేకరించిన డాక్యుమెంట్లు, పంచనామా, సెల్ ఫోన్స్, ల్యాప్ టాప్ లాక్కున్నరని తెలిపారు. మరోవైపు ఐటీ అధికారి రత్నాకర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు మల్లారెడ్డి. పంచనామాలపై సంతకాల కోసం మూడు గంటల పాటు ఐటీ అధికారులు ప్రయత్నాలు చేశారు. చివరకు ఛాతినొప్పితో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డితో సంతకాలు తీసుకున్నారు.
Also Read : తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న దర్యాప్తు సంస్థల హవా…
అయితే, మహేందర్ రెడ్డి చేత సంతకం తీసుకోవడంపై మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హుటాహుటిన ఒంటరిగా ఆసుపత్రికి వెళ్లి కుమారుడ్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఇంటికెళ్లి ఐటీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అధికారి రత్నాకర్ ను బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి, తన కుమారుడితో బలవంతంగా సంతకాలు తీసుకున్నాడని మల్లారెడ్డి ఫిర్యాదు చేశారు. ఇలా ఐటీ అధికారులు, మంత్రి ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి :
- ఎంఎల్‌ఏల కొనుగోలు కేసు…. మరో ఇద్దరికీ నోటీసులు
- మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి ఛాతినొప్పి…. ఆసుపత్రికి తరలింపు
- వచ్చే నెల నుంచి అన్నదాత క్లోజ్.. రామోజీ నిర్ణయంతో పాఠకుల షాక్
- మంత్రి శ్రీనివాస్ గౌడ్ పీఏ కుమారుడు సూసైడ్… కారణం అదేనా?
- 40 సీట్లు గెలిస్తే పవనే సీఎం.. ఏపీలో బీజేపీ స్కెచ్ అదుర్స్
4 Comments