Telangana

నిఘా నీడ‌లో గులాబీ నేత‌లు.. ఎవ‌ర్నీ వ‌దిలేది లేదంటున్న ఐటీ అధికారులు

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ‌లో రాజ‌కీయం వేడెక్కింది. గ‌డిచిన 7 ఏళ్ల‌గా అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ నేత‌లు ఎడాపెడా సంపాదించార‌ని వారి ద‌గ్గర బ‌ల‌మైన ఆధారాలు ఉన్నాయి. కేసీఆర్ కూడా మొద‌టి నుండి ఆర్థికంగా బ‌లంగా ఉండేవారినే ప్రోత్స‌హిస్తూ వ‌చ్చారు. వారికే టికెట్ల కేటాయింపులో ప్రాధాన్య‌త ఇచ్చేవారు. కేవ‌లం మూడు ప్ర‌ధాన సామాజిక‌వ‌ర్గాలకు చెందినవారికే ప్రాతినిధ్యం క‌ల్పించారు. దీంతో వారు ఎడాపెడా సంపాదించార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ 7 ఏళ్లలో వారి ఆస్తుల విలువ కూడా అమాంతం పెరిగింద‌ని.. దీంతో బ్లాక్ మ‌నీని వైట్‌గా మార్చుకునేందుక‌కు భారీగా భూముల కొనుగోలు చేశార‌ని వారిపై ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. లిక్విడ్ క్యాష్ జనరేట్ అయ్యే వ్యవస్థలను ప్రొత్సహించడంతో వీరంతా వేల కోట్లుకు పడగలెత్తారు.

Also Read : హిందువుగా వేషం వేసి బురిడి కొట్టిస్తున్న ఐసిస్ ఉగ్ర‌వాది!

ముగ్గురి కోటరీలే టార్గెట్.. కేసీఆర్ బలగం ఔట్!

2019 పార్ల‌మెంట్ ఎన్నిక‌ల నుండి బీజేపీ తెలంగాణ‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టింది. సంప‌ద ఎక్కువ‌గా ఉండే ద‌క్షిణ‌భార‌త‌దేశంలో ఆ పార్టీ అంత బ‌లంగా లేక‌పోవ‌డంతో వారు ఈ ప్రాంతంపై ఫోక‌స్ పెంచారు. దీని కోసం కేసీఆర్‌కు ఆర్థికంగా అండ‌గా ఉండే మైహోం, మేఘా సంస్థ‌ల‌ను ముందుగా త‌మ కంట్రోల్‌లోకి తెచ్చుకున్నారు. వారికి మ‌హారాష్ట్ర, బెంగాల్ ఎన్నిక‌ల్లో మ‌మేకం అయ్యేలా చేసి వారిని తెలంగాణ నుండి సైడ్ చేశారు. మేఘా సంస్థ‌కు ద‌క్షిణాదిన అదాని రేంజ్‌లో కాంట్రాక్ట్‌ల‌ను ముట్ట‌గ‌డుతున్నారు. మైహోం సంస్థ మీడియాను త‌న గుప్పెట్లో ఉంచుకుంది. భారీగా క్యాష్ జ‌న‌రేట్ అయ్యే ప్ర‌తిమ‌, య‌శోద హాస్పిట‌ల్స్‌, అనురాగ్‌, మ‌ల్లారెడ్డి యూనివ‌ర్స‌టీలు య‌జ‌మానులు అంద‌రూ ఈడీకి టార్గెట్ అవుతున్నారు. ఇదంతా ముందుగా కేసీఆర్‌కు ఆర్థికంగా ద‌న్నుగా ఉన్న‌వారంద‌రినీ దూరం చేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తుంది.

Also Read : లారీ ఢీకొని కోడి మృతి…. ఆందోళనకు దిగిన గ్రామస్థులు… ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జామ్

కేటీఆర్ పై స్పెష‌ల్ ఫోక‌స్‌

ఇప్పుడు కేసీఆర్ త‌ర్వాత పార్టీలో రెండో స్థానంలో ఉన్న కేటీఆర్ టీమ్‌పై కూడా స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టారు. కేసీఆర్‌కు స‌న్నిహంతా ఉండే ఓ ఎమ్మెల్సీ ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్న్స్‌ను ఈ రెండేళ్ల‌లో ఐదుసార్లు ప‌రిశీలించారంటే వారిపై ఫోక‌స్ ఏ రేంజ్‌లో ఉందో అర్ధ‌మ‌వుతుంది. అయితే మొద‌టి నుండి భూస్వాములు కావ‌డంతో వారు కూడా జాగ్ర‌త్త‌ప‌డ్డారు. అలాగే న‌గ‌రంలో మ‌రో స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీకి కూడా స్కెచ్ వేశారు. అయితే ఈయ‌న త‌న పెట్టుబ‌డి మొత్తం బినామీల పేరుతో పెట్ట‌డంతో ఐటీకి ఎటువంటి ఆధారాలు దొర‌క‌లేదు. దీంతో ఐటీ అధికారులు వారిపై గ‌ట్టి నిఘా ఏర్పాటుచేసి స‌రైన స‌మ‌యం కోసం ఎదురుచూస్తున్నారు. కేటీఆర్ టీమ్‌లో మ‌రో ముఖ్య‌మైన వ్య‌క్తి సంతోష్‌రావు. అయితే ఈ ఐటీ, ఈడీ దాడుల నేప‌థ్యంలో ఈయ‌న సైలెంట్ అయిపోయార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. లిక్క‌ర్ స్కామ్‌లో ఈయ‌న పేరు బ‌య‌ట‌కురావ‌డంతో ఈయ‌న టీమ్ మొత్తం ఎవ‌రికివారు చ‌డిచ‌ప్పుడు లేకుండా ఉన్నార‌ని తెలుస్తుంది. ఇటీవ‌ల జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో కూడా ఈ టీమ్ నుండి ఎటువంటి ఫండింగ్ జ‌ర‌గ‌లేదు.

Also Read : వ్యభిచార కూపం నుంచి చాకచక్యంగా బయటపడ్డ బాలిక…. సికింద్రాబాద్ రైల్వే పోలీసులు చొరవతో తల్లిదండ్రుల చెంతకు

ఆర్థికంగా బ‌లంగా ఉండేవారిని త‌మ కంట్రోల్‌లో పెట్టుకునే టిఆర్ఎస్ పార్టీ ఉద్య‌మంలో ప‌నిచేసి త‌మ కుటుంబంతో స‌న్నిహితంగా ఉండేవారికి జిల్లాల్లో ఫుల్ ప‌వ‌ర్స్ ఇచ్చేసింది. వీరు జిల్లాల‌లో భారీగా అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని కేంద్ర ప్ర‌భుత్వం వ‌ద్ద స్ప‌ష్ట‌మైన ఆధారాలు ఉన్నాయి. వంద‌ల కోట్లు ఆస్తులు కూడ‌గ‌ట్టినా వీరు ఐటీ రిట‌ర్న్స్ మాత్రం చాలా నామిన‌ల్‌గా పే చేస్తున్నార‌ని అధికారులు ఆధారాలు సేక‌రించారు. హైద‌రాబాద్‌లో సినిమా రంగ ప్ర‌ముఖుల‌కు భారీగా ఫైనాన్స్ ఇచ్చార‌ని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌కు ఇప్ప‌టికే నోటీసులు అందాయి. త‌ల‌సాని కుటుంబం ప‌బ్స్‌, రెస్టారెంట్స్ రంగంలో ఉండ‌టంతో క్యాసినో వ్య‌వ‌హ‌రంలో విచార‌ణ ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. మైనార్టీ ఎమ్మెల్సీ ఆస్తులపైనా కూడా ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు . అవసరమైతే వక్ఫ్ బోర్డు భూముల్లో జరిగిన లావాదేవీలపై కూడా ఫోకస్ పెంచాల‌ని ప్ర‌ణాళిక‌లు జ‌రుగుతున్నాయి.

 Also Read : ఈడీ, ఐటీ సోదాలు… టీఆర్ఎస్, బీజేపీ కలిసి ఆడుతున్న నాటకాలు : ప్రవీణ్ కుమార్

రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ లో చేరిన ఇద్దరి ఎమ్మెల్యేలను ఐటీ అధికారుల నిఘాలో ఉన్నారు. వీరి ఆస్తులు భారీగా పెరిగినా.. ఎన్నికల్లో ప్రభావం చూపించేంత సీన్ లేక‌పోవ‌డంతో ప్ర‌స్తుతానికి వీరి వ్య‌వ‌హారం హోల్డ్‌లో పెట్టారు. ఈ జిల్లాలోనే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ, లోకల్ బాడీ ఎమ్మెల్సీపైనా ఫోకస్ అధికారులు ఓ క‌న్నేసి ఉంచారు. ఇక ఉప్పల్, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి ఎమ్మెల్యేల కుటుంబాలు రియల్ ఎస్టేట్ లో భారీగా పెట్టుబడులు పెట్టినా వారికి అంతగా లాభాలు ద‌క్క‌లేదు. ఈ వ్య‌వ‌హారం కూడా పెండింగ్‌లోనే ఉంది. మెదక్ లో మహిళా ఎమ్మెల్యే ఒక‌రు ఈ మూడేళ్లలో 500 ఎకరాలు తీసుకున్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇన్ఫ‌ర్మేష‌న్ అందింది. దీంతోపాటు ఇక్కడ ఇద్దరు ఎంపీలపై కూడా ఐటీ శాఖ దృష్టి పెట్టింది. జహీరాబాద్ ఎంపీ ఇప్పటికే నోటీసులు అందుకున్నారు. ఇలా ఉమ్మడి జిల్లాల వారీగా ఎవరైతే అక్రమ సంపాదనతో అధికార పార్టీకి విచ్చలవిడిగా ఫండింగ్ చేస్తున్నారో వారిని కేంద్ర దర్యాప్తు సంస్థలు త‌మ నిఘాను ముమ్మ‌రం చేసాయి. ఈ వ్య‌వ‌హారం రాబోయే రోజుల్లో మ‌రింత తీవ్రంగా మారే అవ‌కాశం ఉంది.

ఇవి కూడా చదవండి : 

  1. ఈనెల 28 నుండి ఐదో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర….
  2. మంత్రి మల్లారెడ్డిపై బోయిన్ పల్లి పీఎస్‌ లో కేసు నమోదు….
  3. ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో సిట్ దూకుడు… విచారణకు రావాలంటూ ఎంపీ రఘురామకు నోటీసులు
  4. మల్లారెడ్డి విద్యాసంస్థల్లో భారీగా అక్రమాలు గుర్తించిన ఐటీ శాఖ
  5. తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న దర్యాప్తు సంస్థల హవా…

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.