Telangana

ఈనెల 28 నుండి ఐదో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర….

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఐదో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర నవంబర్ 28వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం కానుంది. బాసరలో అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి బైంసా నుంచి పాదయాత్ర ప్రారంభిస్తామని ప్రజా సంగ్రామ యాత్ర సహ ప్రముఖ్ టీ వీరేందర్ గౌడ్ వెల్లడించారు. నవంబర్ 28వ తేదీ నుంచి డిసెంబర్ 15 లేదా 16వ తేదీ వరకు పాదయాత్ర కొనసాగుతుందని, ఈ పాదయాత్ర నిర్మల్, ఖానాపూర్, వేముల వాడ, జగిత్యాల, చొప్పదండి మీదుగా సాగి కరీంనగర్ లో ముగింపు సభ ఉంటుందని పేర్కొన్నారు.

Read Also : ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో సిట్ దూకుడు… విచారణకు రావాలంటూ ఎంపీ రఘురామకు నోటీసులు

సీఎం కేసీఆర్ కుటుంబ అవినీతి నియంత పాలనకు వ్యతిరేకంగా బండి సంజయ్ ఇప్పటివరకు నాలుగు విడతలుగా పాదయాత్ర చేసి 13 ఎంపీ, 48 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 21 జిల్లాల్లో 1178 కిలీ మీటర్లు సాగినట్లు వీరేందర్ గౌడ్ తెలిపారు. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు ఈ పాదయాత్ర ఉపయోగపడుతుందన్నారు. అలాగే తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అని సంకేతాలు వెలువడ్డాయని ఆయన అన్నారు. అదే విధంగా ప్రజా గోస – బీజేపీ భరోసా యాత్ర నవంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. డిసెంబర్ 14వ తేదీ వరకు ఈ యాత్ర కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక్కో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఒకట్రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలో బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు.

Also Read : మల్లారెడ్డి విద్యాసంస్థల్లో భారీగా అక్రమాలు గుర్తించిన ఐటీ శాఖ

మెదక్, దుబ్బాక, ఆందోల్, జహీరాబాద్, గద్వాల్, నాగర్ కర్నూల్, జడ్చర్ల, షాద్ నగర్, చేవెళ్ల, పరిగి, నల్గొండ సూర్యపేట, తుంగతుర్తి, పరకాల, వర్థన్నపేట, మహబూబాబాద్, ములుగు నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు చేపట్టనున్నారు. రాష్ట్రంలోని అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాలకు పూర్తి సమయం ఇచ్చి పని చేసే కొత్త విస్తారక్ లను నియమించాలని బీజేపీ నిర్ణయించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 4, 5 వేల మందిని కొత్త ఓటర్లుగా నమోదు చేయించాలని నేతలకు పార్టీ సూచించింది. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ, ధరణి సమస్యల పరిష్కారానికి డిసెంబర్ 9న కలెక్టరేట్ల ముందు ధర్నా చేపట్టాలని పార్టీ పేర్కొందని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి : 

  1. తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న దర్యాప్తు సంస్థల హవా…
  2. ఎం‌ఎల్‌ఏల కొనుగోలు కేసు…. మరో ఇద్దరికీ నోటీసులు
  3. మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి ఛాతినొప్పి…. ఆసుపత్రికి తరలింపు
  4. వచ్చే నెల నుంచి అన్నదాత క్లోజ్.. రామోజీ నిర్ణయంతో పాఠకుల షాక్
  5. 40 సీట్లు గెలిస్తే పవనే సీఎం.. ఏపీలో బీజేపీ స్కెచ్ అదుర్స్

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.