
క్రైమ్ మిర్రర్, అమరావతి బ్యూరో : తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ చేసింది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అయితే తెలంగాణ బీజేపీలో దూకుడు కనిపిస్తోంది. అధికార టీఆర్ఎస్ పార్టీలో ఢీ అంటే ఢీ అనేలా పోరాడుతోంది. మునుగోడు ఉప ఎన్నికలో కేసీఆర్ ఎన్ని ఎత్తులు వేసినా గట్టి పోటీ ఇచ్చింది. మునుగోడు బైపోల్ తర్వాత తెలంగాణ బీజేపీలోకి వలసలు జోరుగా సాగుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ బలంగానే ఉన్నా బీజేపీ వ్యూహాలతో ఆ పార్టీ రోజురోజుకు బలహీన పడుతోంది. హస్తం నేతలు ఒక్కొక్కరుగా కమలం గూటికి చేరుతున్నారు. ఇటీవలే నిర్మల్ జిల్లా అధ్యక్షుడు కాషాయ కండువా కప్పుకున్నారు. సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కూడా బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. త్వరలోనే మరికొంత మంది కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. బండి సంజయ్ టీమ్ దూకుడుతో తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్వాయమనే సీన్ కనిపిస్తోంది. ఇదే దూకుడుతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జెండా ఎగరేస్తామని కమలం నేతలు ధీమాగా ఉన్నారు.
Read More : ప్రైవేట్ జెట్ లో వంద కోట్ల రూపాయలు తరలింపు? లిక్కర్ స్కాంలో కవితకు బిగిస్తున్న ఉచ్చు?
తెలంగాణలో అంతా బాగానే ఉన్నా ఏపీలో మాత్రం బీజేపీ పరిస్థితి దారుణంగా ఉంది. అయినా ఏపీలోనూ పాగా వేసేలా మోడీ, అమిత్ షా టీమ్ స్కెచ్ వేసిందని తెలుస్తోంది. ఏపీకి సంబంధించి బీజేపీ పక్కా ప్రణాళికలు రచించిందని అంటున్నారు. పలు రాష్ట్రాల్లో ప్రయోగించిన ఫార్ములానే ఏపీ రాజకీయాల్లో ఉపయోగించేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది.ప్రస్తుతం ఏపీలో బిజెపి, జనసేన పార్టీలు పొత్తు కొనసాగిస్తున్నాయి. టిడిపిని కలుపుకు వెళదామంటూ పవన్ బిజెపిపై ఒత్తిడి చేస్తున్న బిజెపి పెద్దలు ఏమాత్రం అంగీకరించడం లేదు.రాబోయే ఎన్నికల్లో బిజెపి, జనసేన అన్ని స్థానాల్లోనూ పోటీ చేసేందుకు సమయత్వం అవుతున్నారు.
నిజానికి ఏపీలో జనసేన , బిజెపిలకు అంతగా ఓటు బ్యాంకు లేదు. సంస్థాగతంగా టిడిపి, వైసిపిలు బలంగా ఉన్నాయి.175 స్థానాలకు 175 స్థానాలను తామే సాధిస్తామని జగన్ చాలా నమ్మకంతో ఉండగా, వైసిపి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగిందని, ఈసారి తెలుగుదేశానికి అవకాశం ఇస్తారని టిడిపి ఆశలు పెట్టుకుంది.అంతేకాదు ఇవే తనకు చివరి ఎన్నికలు అంటూ టిడిపి అధినేత చంద్రబాబు సెంటిమెంటును రగిలించే ప్రయత్నం చేస్తుండగా, బిజెపి మాత్రం వేరే లెక్కలు వేసుకుంటుంది. 2024 ఎన్నికల్లో ఏపీలో హంగ్ వస్తుందని బిజెపి అంచనా వేస్తోంది.అదే జరిగితే బిజెపి జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని బిజెపి పెద్దలు లెక్కలు వేసుకుంటున్నారట.
Read More : గవర్నర్ గా మర్రి శశిధర్ రెడ్డి? బీజేపీ పెద్దలతో హామీతోనే జంప్..
అందుకే తెలంగాణతో పాటు, ఏపీ పైన బీజేపీ పెద్దలు ప్రత్యేక ఫోకస్ పెట్టారు.కేంద్ర హోంమంత్రి ఆమిత్ షా , ప్రధాని నరేంద్ర మోది వీలైనన్ని ఎక్కువసార్లు ఏపీకి వచ్చి బిజెపి జనసేన కూటమి తరపున ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నారట. పవన్ ను హైలెట్ చేయడం ద్వారా, ఏపీలో ప్రధాన సామాజిక వర్గమైన కాపులు పూర్తిగా తమ వైపు ఉంటారని, అవసరమైతే ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తమ కూటమి తరఫున ప్రకటించి ఎన్నికలకు వెళ్తే కనీసం 40 కి పైగా స్థానాలు దక్కుతాయని బిజెపి పెద్దలు అంచనా వేస్తున్నారట. మొదట్లో వైసీపీకి ఉన్నంత సానుకూలత ఇప్పుడు లేకపోవడంతో, ఎన్నికల సమయం నాటికి ప్రభుత్వ వ్యతిరేకత మరింత పెరుగుతుందని, అప్పటికి టిడిపి కూడా బలోపేతం అవుతుందని, అదే జరిగితే రెండు పార్టీలకు స్పష్టమైన మెజారిటీ రాదని, జనసేన ,బిజెపి కచ్చితంగా 40 స్థానాలు గెలుచుకుంటే ఏపీలో హాంగ్ ఏర్పడుతుందని, కర్ణాటక మహారాష్ట్రలలో మాదిరిగా ఏపీలోనూ బిజెపి అధికారంలోకి వస్తుందని బిజెపి పెద్దలు అంచనా వేస్తున్నారట.
ఇవి కూడా చదవండి …
- కూసుకుంట్లకు మిగిలింది 10 నెలలేనా? వచ్చేసారి ఇంటికే పరిమితమా?
- మునుగోడులో తెరాస అదినేత స్పెషల్ సర్వే…. పార్టీకి భంగం కలిగించే సొంత పార్టీ నేతలకు చెక్
- ఎమ్మెల్సీ పదవిపై కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు…. పదవితో తృప్తి లేదన్న నేత
- కాంగ్రెస్ పార్టీకి మర్రి శశిధర్ గుడ్ బై….. అధికారికంగా ప్రకటించిన సీనియర్ నేత
- కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మార్పు వ్యవహారంపై స్పందించిన జగ్గారెడి..
6 Comments