
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మార్పుపై టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. శశిధర్ రెడ్డి పార్టీ మారితే కాంగ్రెస్‌కు నష్టమని అభిప్రాయం వ్యక్తం చేశారు. మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మారితే దానికి పూర్తి బాధ్యత టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలదేనని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తమ పార్టీలో ఇబ్బంది ఉందని, పీసీసీ, సీఎల్పీ సమన్వయం చేయాలని సూచించారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి తీరుపై జగ్గారెడ్డి మండిపడ్డారు. పాదయాత్రలో వన్‌మ్యాన్ షో చేస్తే ఎలా? అంటూ రేవంత్‌ను ఉద్దేశించి సీరియస్ అయ్యారు.
Read Also : తీహార్ జైలులో సకల రాచ మర్యాదలు అందుకుంట్టున్న ఆప్ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ ???
వర్కింగ్ ప్రెసిడెంట్లను సమన్వయం చేయకపోవడం పీసీసీ తప్పేనని వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు కాబట్టి పీసీసీని మార్చాలని తాను చెప్పట్లేదని జగ్గారెడ్డి తెలిపారు. జూమ్ మీటింగ్‌లపై జగ్గారెడ్డి మండిపడ్డారు. ‘ఇదేమైనా కంపెనీనా.. ఇళ్లల్లో కూర్చొని మాట్లాడటానికి. నేను అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా. పార్టీ సిస్టమ్ సరిగ్గా లేదు. ఉన్న పది మంది కూడా కూర్చోని మాట్లాడుకోలేని పరిస్థితి. దీనికి నేను కూడా బాధ్యున్నే’ అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ‘నాకు పీసీసీ అవకాశమిస్తే నా దగ్గర మెడిసిన్ ఉంది. టీఆర్ఎస్, బీజేపీ ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు. టీఆర్ఎస్, బీజేపీ డ్రామా చేస్తున్నాయి. కాంగ్రెస్‌ను ఉనికిలో లేకుండా చేసేందుకు టీఆర్ఎస్, బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నాయి. 8 ఏళ్లలో బీజేపీ హామీలు నెరవేర్చలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలు గాలికి వదిలేశాయి. బీజేపీ, టీఆర్ఎస్ కార్పొరేట్ వ్యవస్థగా పనిచేస్తున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ తిట్టుకొని కొట్టుకుంటే ప్రజలకు వచ్చే లాభం ఏంటి?’ అని జగ్గారెడ్డి విమర్శించారు.
Also Read : నేడే విడుదల…. ప్రగతిభవన్ నుండి నేరుగా నియోజకవర్గాలకు ????
శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మర్రి శశిధర్ భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు సమావేశం జరిగింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అమిత్ షాను కలవడంతో మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమనే వార్తలు వినిపిస్తోన్నాయి. గత కొంతకాలంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుపై మర్రి శశిధర్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రేవంత్‌పై మీడియా వేదికగా పలుమార్లు బహిరంగ విమర్శలు చేశారు. ఇలాంటి తరుణంలో అమిత్ షాను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నేడో, రేపో పార్టీ మారడం ఖాయమనే ప్రచారం సాగుతోంది.
ఇవి కూడా చదవండి :
- సిట్ నోటీసులపై బీజేపీ ఆగ్రహం….. హైకోర్టుకెక్కిన గుజ్జల ప్రేమేందర్ రెడ్డి
- కేసీఆర్ బంపర్ ఆఫర్?… తిరస్కరించిన ఈటల..!
- బీజేపీ ఆఫర్ చేసింది నిజమే.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
- ఈడీ విచారణలో అస్వస్థతకు గురైన టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ… ఆసుపత్రికి తరలింపు
- గ్రామాల్లో ఎమ్మెల్యేలపై నిరసన సెగలు.. సీరియస్ అయిన కేసీఆర్
4 Comments