National

తీహార్ జైలులో సకల రాచ మర్యాదలు అందుకుంట్టున్న ఆప్ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌ ???

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : మనీలాండరింగ్ కేసులో అరెస్టైన ఆప్ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు తీహార్ జైలులో సకల రాచ మర్యాదలు అందుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. జైలులోనూ ఆయనకు వీఐపీ ట్రీట్ మెంట్ లభిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి.

Read Also : నేడే విడుదల…. ప్రగతిభవన్ నుండి నేరుగా నియోజకవర్గాలకు ????

జైలులో ఆయన మసాజ్ చేయించుకుంటున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. జాతీయ మీడియాలో ఈ వీడియోపై పెద్ద ఎత్తున కథనాలు ప్రసారం అవుతున్నాయి. అంతకు ముందు జైళ్లో సత్యేంద్ర జైన్‌కు వీఐపీ ట్రీట్ మెంట్ లభిస్తోందని కోర్టుకు ఈడీ తెలిపింది. అదే సమయంలో ఈ వార్తలను తీహార్ జైలు సూపరింటెండెంట్ ఖండించారు. ఈ క్రమంలో తాజాగా ఈ వీడియో విడుదల కావడం సంచలనం రేపుతోంది.

Also Read : సిట్ నోటీసులపై బీజేపీ ఆగ్రహం….. హైకోర్టుకెక్కిన గుజ్జల ప్రేమేందర్ రెడ్డి

వీడియోలో సత్యేంద్ర జైన్ ఓ వ్యక్తితో మసాజ్ చేయించుకుంటూ కనిపిస్తున్నారు. ఈ వీడియోను ఈ ఏడాది సెప్టెంబర్‌ 21వ తేదీన తీసినట్టుగా తెలుస్తోంది. ఈ వీడియోను బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. తీహార్ జైలు ఢిల్లీ ప్రభుత్వ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో పని చేస్తుంది. జైళ్లలో ఆప్ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘిస్తోందంటూ దానికి సాక్ష్యంగా ఈ వీడియోను పూనావాలా పోస్టు చేశారు.

ఇవి కూడా చదవండి : 

  1. కేసీఆర్ బంప‌ర్ ఆఫ‌ర్‌?… తిరస్కరించిన ఈటల..!
  2. బీజేపీ ఆఫర్ చేసింది నిజమే.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
  3. ఈడీ విచారణలో అస్వస్థతకు గురైన టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ… ఆసుపత్రికి తరలింపు
  4. ఎమ్మెల్సీ కవితపై అర్వింద్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళన
  5. టీడీపీకి చెక్ పెటేందుకు బీజేపీ నయా స్కెచ్.. ప‌వ‌న్‌తో స‌రికొత్త ప్లాన్..!

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.