Andhra Pradesh

టీడీపీకి చెక్ పెటేందుకు బీజేపీ నయా స్కెచ్.. ప‌వ‌న్‌తో స‌రికొత్త ప్లాన్..!

క్రైమ్ మిర్రర్ , ఆన్ లైన్ డెస్క్ :-  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాగైనా పాగా వేయాల‌ని బీజేపీ త‌న రాజ‌కీయ గేమ్‌ప్లాన్‌ను సిద్ధం చేస్తుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా మ‌ళ్లీ అధికారంలోకి రావాలంటే ద‌క్షిణాది రాష్ట్రాల‌పై ఎక్కువ ఫోక‌స్ చెయ్యాల‌ని ఆ పార్టీ ఫిక్స్ అయ్యింది. దీనిలో బ‌లంగా బీజేపీ పార్టీ ప్ర‌భావం పెద్ద‌గా లేని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎలాగైనా సంస్థాగ‌తంగా పార్టీ నిర్మాణం జ‌ర‌గాల‌ని కొత్త స్కెచ్ సిద్ధం చేస్తుంది. తాజాగా విశాఖ‌లో ప‌ర్య‌టించిన మోదీ కూడా ఏపీలో బీజేపీ పార్టీ ప‌రిస్థితిపై కీల‌క వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ద‌క్షిణాది మొత్తం బ‌లంగా ఉన్న బీజీపీ పార్టీ ఏపీలో మాత్రం ఎందుకు పుంజుకోవ‌డం లేద‌ని ఆయ‌న ఏపీ నేత‌ల‌ను ప్ర‌శ్నించారు. అవ‌స‌ర‌మైతే ఏపీకి కొత్త ఇన్‌ఛార్జిని కూడా నియ‌మిస్తాన‌ని వెల్ల‌డించారు. ఇప్ప‌టికే వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో అధికారంలోకి రావాల‌ని బీజేపీ పార్టీ గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తుంది. అక్క‌డ అధికార టీఆర్ఎస్ పార్టీతో హోరాహోరీకి పోరాటం చేస్తూ త‌మ బ‌లాన్ని పెంచుకుంటుంది. అయితే తెలంగాణ‌లో ఎన్నిక‌లు జ‌రిగిన 6 నెల‌ల త‌రువాత ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతాయి. తెలంగాణ‌లో ఒంట‌రిగా ఎన్నిక‌ల‌కు వెళ్లాలా లేదా క‌లిసొచ్చే పార్టీల‌తో పొత్తు కుదుర్చుకోవాలా అనే ఆలోచ‌న‌లు కూడా చేస్తుంది.

Also Read : –ఈడీ విచారణలో అస్వస్థతకు గురైన టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ… ఆసుపత్రికి తరలింపు

అయితే ఏపీలో మాత్రం టీడీపీతో ఎట్టి ప‌రిస్థితిలో పొత్తు పెట్టుకోకూడ‌ద‌ని కేంద్రం పెద్ద‌లు ఏపీ బీజేపీ నేతలకు తేల్చిచెప్పిన‌ట్లు తెలుస్తుంది. భవిష్యత్తులో కూడా ఆ పార్టీతో పొత్తు ఉండ‌ద‌నే సంకేతాలు ఇచ్చిన‌న‌ట్లు తెలుస్తుంది. తెలుగు దేశం పార్టీతో గతంలో కలవటం.. విడిపోవటం కారణంగా పార్టీకి వ‌చ్చిన ప్ర‌యోజ‌నం పెద్ద‌గా ఏం లేద‌ని.. కమలం పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. వారితో పొత్తు వ‌ల‌న పార్టీ సొంతగా బలం పెంచుకొనే అవకాశాలు ఉండవని ఢిల్లీ పెద్దల అభిప్రాయంగా పార్టీ నేతలు చెబుతున్నారు.

Also Read : – జనవరి 18 నుంచి మళ్లీ ‘కంటి వెలుగు’

ఏపీలో ఇప్పటికైనా పార్టీ బలోపేతం పైన ఫోకస్ చేయాలని పార్టీ హైకమాండ్ ఏపీ నేత‌ల‌కు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది.అలాగే టీడీపీ-బీజేపీ ఒక‌ర‌క‌మైన ఓటు బ్యాంకుగ‌ల పార్టీల కాబ‌ట్టి టీడీపీ బ‌లంగా ఉన్నంత‌వ‌ర‌కు ఏపీలో బీజేపీ పార్టీ మ‌నుగ‌డ సాధించ‌డం క‌ష్ట‌మ‌ని ఆ పార్టీ నేత‌లు భావిస్తున్నారు. అందుకే త‌మ మిత్ర‌ప‌క్ష‌మైన జ‌న‌సేన‌తో క‌లిసి ఈసారి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌నేది బీజేపీ వ్యూహంగా పార్టీ నేత‌లు చెబుతున్నారు. అయితే ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన బీజేపీతో అనుకూలంగా ఉంటున్నారు కాబ‌ట్టి ఆచితూచి వ్య‌వ‌హరించాల‌ని కూడా వారు భావిస్తున్నారు.

Also Read : – గ్రామాల్లో ఎమ్మెల్యేల‌పై నిర‌స‌న సెగ‌లు.. సీరియ‌స్ అయిన కేసీఆర్‌

అందుకే టీడీపీ బ లహీనతలను త‌మ బలంగా మార్చుకొనే వ్యూహంలో బీజేపీ ఉందని ఆ పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ప్రధానితో భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ పీఎంను ఉద్దేశించి ట్వీట్లు చేస్తూ ప్రశంసలతో ముంచెత్తారు. దీంతో బీజేపీ-జనసేన బంధానికి ఇబ్బందులు లేవని భావిస్తున్నారు. అయితే మరి వచ్చే ఎన్నికల్లో టీడీపీతో జనసేన కలిసి వస్తుందా.. లేక బీజేపీతో కలిసి వెళ్తుందా అనేది చివరి వరకూ సస్పెన్స్ గానే ఉంటుంది. ఇక టీడీపీతో బీజేపీ అధినాయకత్వం ప్రస్తుతం ఉన్న విధానంలోనే కొనసాగుతుందా లేక ఎన్నిక‌ల స‌మ‌యానికి ఏమైనా మార్పుతో వవస్తుందా అనేది కూడా కాల‌మే నిర్ణ‌యించాలి.

ఇవి కూడా చదవండి :-

  1. ఎమ్మెల్సీ కవితపై అర్వింద్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళన
  2. అమిత్ షా సన్నిహితుడికి సిట్ నోటీస్… ఫాంహౌజ్ డీల్ కేసులో బిగ్ ట్విస్ట్
  3. రాజాసింగ్ భద్రతకు ముప్పు? పట్టించుకోని స్టేట్ ఇంటలిజెన్స్
  4. గుజరాత్ లో అసదుద్దీన్ కు షాక్… ఎంఐఎం ప్రచారంలో మోడీకి మద్దతుగా ముస్లింల నినాదాలు
  5. లవర్ ను 35 ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టిన ఉన్మాది
  6. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అరెస్ట్.. బీజేపీ దర్నాతో ఉద్రిక్తత
  7. క్రైమ్ మిర్రర్ కధనానికి స్పందన…. స్పందించిన అధికారులు, మాట నిలబెట్టుకున్న ఎంపీటీసీ….!!

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.