
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ పీచేముడ్ అన్నారు. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలను ఎదుర్కోవడానికి కేసీఆర్ భయపడుతున్నారు. బీజేపీతో ముందస్తు ఫైట్ కు వెనక్కి తగ్గాడు. ముందస్తు ఎన్నికలు అంటూ వస్తున్న ఊహాగానాలకు కేసీఆర్ తెర దించాడు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండవని. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేవంలో స్పష్టం చేశారు. నేటి నుంచి ఎమ్మెల్యేలంతా క్షేత్రస్థాయిలో ఉండాలని స్పష్టం చేశారు. ఎన్నికలకు గట్టిగా ఏడాది సమయం మాత్రమే ఉందని.. అందరూ కష్టపడాలని సూచించారు. బీజేపీతో ఇక యుద్ధమేనని తేల్చిచెప్పారు.
Read More : నాకోసం అహర్నిశలు కష్టపడిన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు…రాజగోపాల్ రెడ్డి
ఇటీవల కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికల గెలుపుతో బీజేపీని దెబ్బకొట్టాలంటే ఇదే సరైన సమయం అని.. బీజేపీ కాంగ్రెస్ సర్దుకోకముందే ఎన్నికలకు వెళ్లి దెబ్బతీయాలని ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు అసెంబ్లీని రద్దు చేసినా వృథా అని కేసీఆర్ డిసైడ్ అయ్యారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023 డిసెంబర్ లో జరుగుతాయి. దానికంటే ముందే ముందుగా ఎన్నికలకు వెళ్లడానికి కేసీఆర్ రెడీ అయినట్టు ప్రచారం సాగింది. క్షేత్రస్థాయిలో ఇప్పటికే పలు సర్వేలు చేయించుకున్న కేసీఆర్.. ఇప్పుడు వెనక్కి వెళ్లారు. 2023 డిసెంబర్ లో తెలంగాణ ఎన్నికలు జరుగుతాయి.
అంటే ఇప్పటికీ సంవత్సరం టైం ఉంది. ఇప్పుడు అసెంబ్లీని రద్దు చేస్తే 6 నెలలలోపు ఎన్నికలు ఉంటాయి. అంటే కేవలం 6 నెలల ముందుగానే కేసీఆర్ ఎన్నికలు కోరుకుంటారు. అందుకే 6 నెలలతో పోయేది ఏంటని భావించిన కేసీఆర్ అనవసరంగా ముందస్తుకు వెళ్లడం కంటే షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు. 6 నెలల కోసం మళ్లీ ముందస్తుకు వెళ్లడం వృథా అని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
Read More : క్రైమ్ మిర్రర్ కధనానికి స్పందన…. స్పందించిన అధికారులు, మాట నిలబెట్టుకున్న ఎంపీటీసీ….!!
రాబోయే పది నెలలు బీజేపీతో యుద్ధమే ఉంటుందని ఎమ్మెల్యేలకు స్పష్టం చేసిన కేసీఆర్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలను తనవైపు తిప్పుకునేందుకు బీజేపీ ఏమైనా చేస్తుందని వారికి తెలిపారు. ఈ క్రమంలో కేసీఆర్ తన కూతురు, ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించినట్టు తెలుస్తోంది. చివరకు కవితను కూడా తమ పార్టీలో చేరాలంటూ బీజేపీ ఒత్తిడి తీసుకొచ్చిందని కేసీఆర్ పార్టీ నేతలకు వివరించారు. టీఆర్ఎస్‌ను బలహీనపరిచేందుకు బీజేపీ అనేక కుట్రలు చేసే అవకాశం.. ఈ విషయంలో పార్టీ నేతలు ఎంతో జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్ వారిని హెచ్చరించారు.ఫామ్ హౌస్ కేసు వ్యవహారంలో ఉన్న ఎమ్మెల్యేల గురించి కేసీఆర్ నేతలకు వివరించారు.
తమను బీజేపీ ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తోందనే విషయాన్ని ఈ నలుగురు ఎమ్మెల్యేలు వెంటనే తన దృష్టికి తీసుకొచ్చారని.. మిగతా ఎమ్మెల్యేలు సైతం వీరి తరహాలోనే ముందుకు సాగాలని వారికి సూచించారు. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో మెజార్టీ ఎమ్మెల్యేలకు మళ్లీ పోటీ చేసే అవకాశం ఇవ్వాలని తాను భావిస్తున్నానని చెప్పిన సీఎం కేసీఆర్.. రాబోయే 10 నెలల కాలంలో వారి పనితీరు ఏ విధంగా ఉంటుందనే అంశాలపై స్పష్టత వచ్చిన తరువాతే దీనిపై నిర్ణయం ఉంటుందని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి …
- రాజాసింగ్ భద్రతకు ముప్పు? పట్టించుకోని స్టేట్ ఇంటలిజెన్స్
- తెలంగాణ ముఖ్యమంత్రిగా కేటీఆర్.. పార్టీ సమావేశంలో కేసీఆర్ ప్రకటన?
- గుజరాత్ లో అసదుద్దీన్ కు షాక్… ఎంఐఎం ప్రచారంలో మోడీకి మద్దతుగా ముస్లింల నినాదాలు
- లవర్ ను 35 ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టిన ఉన్మాది
- మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అరెస్ట్.. బీజేపీ దర్నాతో ఉద్రిక్తత
2 Comments