
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత లక్ష్మణ్ ఫైరయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో సీఎం కేసీఆర్ ఎందుకు పాల్గొనడం లేదని ప్రశ్నించారు. రేపు రామగుండం ఎరువు ఫ్యాక్టరీని ప్రధాని మోడీ జాతికి అంకితం చేస్తారు. ఆ కార్యక్రమానికి కేసీఆర్ హాజరుకావడం లేదు. దీనిని లక్ష్మణ్ తప్పుపట్టారు. ఇప్పుడే కాదు.. ఇదివరకు కూడా దూరంగా ఉన్నారని గుర్తుచేశారు. ఇదీ మంచి పద్దతి కాదని హితవు పలికారు. దీంతో తెలంగాణ రాష్ట్రానికి నష్టం వాటిల్లనుందని ఆయన అన్నారు.
Read Also : ఈడీ, ఐటీ దాడులు టిఆర్‌ఎస్ పార్టీలో గుబులు…. పార్టీ నేతలకు కేసిఆర్ ఫోన్లు
మోడీ రావొద్దని హొర్డింగ్స్ ఎలా పెడతారని లక్ష్మణ్ అడిగారు. ప్రధాని పర్యటనను రాజకీయం ఎలా చేస్తారని ప్రశ్నించారు. రేపు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేసేందుకు మోడీ వస్తున్నారు. ఇక్కడ పర్యటన ముగిసిన వెంటనే ఏపీకి పయనం అవుతారు. రామగుండం పర్యటన కోసం తెలంగాణ బీజేపీ నేతలు ఏర్పాట్లు చేశారు. ఇదీ కేంద్ర ప్రభుత్వ అధికార కార్యక్రమం.. కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ హాజరు కావడం లేదు. సీఎస్.. ఇతర ఉన్నతాధికారులు వచ్చే అవకాశం ఉంది. ప్రధాని మోడీ రాకను కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తుండటం విడ్డూరం అని మరో నేత విజయశాంతి అభిప్రాయ పడ్డారు.
Also Read : లిక్కర్ స్కాంలో విజయసాయి రెడ్డి అల్లుడు అరెస్ట్.. నెక్స్ట్ కేసీఆర్ ఫ్యామిలీయేనా?
కార్మిక వర్గాల అభివృద్ధి అని కమ్యూనిస్టులు చెప్పే అంశాలు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రగతి సాధించిందని తెలిపారు. వ్యవసాయ – పారిశ్రామిక రంగాల అభివృద్ధి, ఉద్యోగ కల్పన కోసం రోజ్‌గార్ మేళాలు, ముద్ర లోన్లు, బీమా పథకాలు, స్కిల్ ఇండియా, మేకిన్ ఇండియా, శ్రమయేవ జయతే, అటల్ పెన్షన్, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, ఉజ్జ్వల ప్లాన్ ఇలా అన్ని వర్గాలకూ ప్రత్యేక పథకాలతో మోదీ సర్కారు విస్తృత ప్రజాదరణ సాధించిందని చెప్పారు. టీఆర్‌ఎస్ పార్టీతో కలిసి మునుగోడు ఉప ఎన్నికలో కమ్యూనిస్టులు కలిసి పనిచేయడంపై గుర్రుమన్నారు. దీంతో ఆ పార్టీ కార్యకర్తల విశ్వాసాన్ని కూడా కోల్పోతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు రాష్ట్రంలోకి ప్రధాని రాకను వ్యతిరేకించి.. వారి విలువను మరింతగా తగ్గించుకుంటున్నారని ఫైరయ్యారు.
ఇవి కూడా చదవండి :
- ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది… పాశం సురేందర్ రెడ్డి
- పోలీసు ఇన్ఫార్మర్ నేపంతో గొత్తికోయ యువకున్ని నరికి చంపిన మావోలు….
- ‘మోదీ నో ఎంట్రీ టూ తెలంగాణ’… ప్రధానికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు
- మునుగోడు ఎంఎల్‌ఏగా కుసుకుంట్ల ప్రమాణస్వీకారం…
- కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై వేటుకు రంగం సిద్దం….పార్టీకి వెన్నుపోటు పొడిచారంటూ నేతల ఆరోపణ
One Comment