International

కొంపముంచిన చెత్త బౌలింగ్…. ప్రపంచకప్పు ఫైనల్ లో ఇంగ్లండ్

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : టీ20 ప్రపంచకప్ 2022లో టీమిండియా పోరాటం ముగిసింది. గురువారం జరిగిన సెమీఫైనల్-2లో సమష్టిగా విఫలమైన రోహిత్ సేన.. 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చేతిలో చిత్తయ్యింది. ఇంగ్లండ్ ఓపెనర్లు జోస్ బట్లర్(49 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 80 నాటౌట్), అలెక్స్ హేల్స్(47 బంతుల్లో4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 86 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్‌కు కనీస పోరాటం కూడా చేయకుండా భారత ఆటగాళ్లు చేతులెత్తేసారు. ముఖ్యంగా పేలవ బౌలింగ్‌తో కనీసం ఒక్క వికెట్ తీయలేకపోయారు.

Read More : ప్రేమజంట ఆత్మహత్య….గతంలోనే యువతికి వివాహం

ఈ మెగా టోర్నీలోనే టీమిండియాకు ఇది అత్యంత ఘోర పరాజయం. జోస్ బట్లర్, హేల్స్ ధాటికి భారత బౌలర్లు పోటాపడీ పరుగులిచ్చుకున్నారు. మైదానంలో రోహిత్ ఎన్ని వ్యూహాలు పన్నినా ఈ జోడీని విడదీయలేకపోయాడు. దాంతో మరోసారి టీమిండియా టైటిల్ లేకుండానే ఇంటిదారిపట్టింది.ఈ మ్యా‌చ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా(33 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 63), విరాట్ కోహ్లీ(40 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 50) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ మూడు వికెట్లు తీయగా.. ఆదిల్ రషీద్, క్రిస్ వోక్స్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ 16 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 170 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ హాఫ్ సెంచరీలతో 170 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని అందించి చిరస్మరణీయ విజయాన్నందించారు. భారత బౌలర్లలో భువీ రెండు ఓవర్లలో 25 పరుగులివ్వగా.. అర్ష్‌దీప్ 2 ఓవర్లలో 15, అక్షర్ పటేల్ 4 ఓవర్లలో 30, మహమ్మద్ షమీ 3 ఓవర్లలో 39, రవిచంద్రన్ అశ్విన్ 2 ఓవర్లలో 27, హార్దిక్ పాండ్యా 3 ఓవర్లలో 34 పరుగులు సమర్పించుకున్నారు.

ad 728x120 SRI copy - Crime Mirror

  1. లిక్కర్ స్కాంలో విజయసాయి రెడ్డి అల్లుడు అరెస్ట్.. నెక్స్ట్ కేసీఆర్ ఫ్యామిలీయేనా?
  2. మద్యం కుంభకోణంలో మరో ఇద్దరి అరెస్ట్…
  3. పోలీసు ఇన్ఫార్మర్ నేపంతో గొత్తికోయ యువకున్ని నరికి చంపిన మావోలు….
  4. ‘మోదీ నో ఎంట్రీ టూ తెలంగాణ’… ప్రధానికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు
  5. మునుగోడు ఎం‌ఎల్‌ఏగా కుసుకుంట్ల ప్రమాణస్వీకారం…

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.