
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. నవంబర్ 12వ తేదీన తెలంగాణకు రానున్న మోదీ.. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్)ను జాతికి అంకితం చేయనున్నారు. అందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా.. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. మోదీ పర్యటన వ్యతిరేకిస్తూ కొందరు గుర్తుతెలియని వ్యక్తులు హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
Read Also : మునుగోడు ఎంఎల్‌ఏగా కుసుకుంట్ల ప్రమాణస్వీకారం…
‘మోదీ నో ఎంట్రీ టూ తెలంగాణ’ అంటూ జూబ్లీహిల్స్ చౌరస్తాలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చేనేతపై విధించిన 5 శాతం జీఎస్టీని ఎత్తివేయాలని ఫ్లెక్సీల్లో డిమాండ్ చేసారు. ఈ ఫ్లెక్సీలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మరోవైపు.. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనపై రాజకీయ రచ్చ హీట్ పెంచుతోంది. మోదీ పర్యటనను అడ్డుకుంటామని, ఆందోళనలు చేస్తామంటూ వామపక్ష, విద్యార్థి జేఏసీ నేతలు హెచ్చరించడంతో.. రాష్ట్రంలో మోదీ పర్యటనపై దుమారం చెలరేగుతోంది. ఇప్పటికే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభమై ఉత్పత్తి మొదలైందని, ఉత్పత్తి కూడా ప్రారంభమైన తర్వాత ఇప్పుడు ప్రారంభించడం ఏంటని ప్రశ్నిస్తోన్నారు.
Also Read : ఓటర్లకు ఇవ్వాల్సిన కోట్లాది రూపాయలు స్వాహా! రాజన్నను ముంచేసిన మర్రిగూడెం బీజేపీ నేతలు!
ఈ సందర్భంగా విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలపై టీఆర్ఎస్ ప్రశ్నించింది. విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలు సంగతేంటని, నీతి ఆయోగ్ చెప్పిన నిధులు ఇచ్చేది ఎప్పుడు? అంటూ టీఆర్ఎస్ ప్రశ్నించింది. తెలంగాణకు చేసిన అన్యాయాలపై మోదీ ఏం చెబుతారు? తెలంగాణకు ఉత్త చేతులతోనే మోదీ వస్తారా? లేక ఏమైనా తెస్తారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. అయిపోయిన పెళ్లికి బాజాలు కొట్టినట్లు.. రెండేళ్ల క్రితం పున:ప్రారంభమైన ఫ్యాక్టరీని జాతికి అంకితం చేస్తానంటూ మాయ చేయడానికి కాకపోతే మోదీ ఎందుకు వస్తున్నారు? టీఆర్ఎస్ ఘాటుగా ప్రశ్నింస్తుంది.
ఇవి కూడా చదవండి :
- ప్రేమజంట ఆత్మహత్య….గతంలోనే యువతికి వివాహం
- మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఐటి, ఈడీ అదికారుల సోదాలు….
- కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై వేటుకు రంగం సిద్దం….పార్టీకి వెన్నుపోటు పొడిచారంటూ నేతల ఆరోపణ
- బిజేపి అభ్యర్డుల జాబితాలో క్రిక్కెటర్ జడేజా భార్య…..
- మునుగోడు రిజల్ట్ చూసి షేకైన కేసీఆర్.. బీజేపీ ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్?