
క్రైమ్ మిర్రర్, ములుగు(ప్రతినిధి): ఏజెన్సీలో మావోయిస్టులు పోలీసు ఇన్ఫార్మర్ నేపంతో గొత్తికోయ యువకున్ని నరికి చంపిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు డబ్బు ఆశ చూపించి మావోయిస్టుల కదలికలు సమాచారం తెలిపేందుకు యువకుడిని ఇన్ ఫార్మర్ గా మార్చారని ప్రజా కోర్టు పెట్టి నరికి చంపిన మావోయిస్టులు.
Read Also : మునుగోడు ఎంఎల్‌ఏగా కుసుకుంట్ల ప్రమాణస్వీకారం…
ములుగు జిల్లా నూగురు వెంకటాపురం మండలం కే కొండాపూర్ గ్రామానికి సమీప అడవిలో ఉంటున్న గుత్తికోయ గూడానికి చెందిన సబ్బాక గోపాల్ అనే యువకుడు గత కొంతకాలంగా మావోయిస్టు పార్టీకి అనుసంధానంగా ఉంటూ పోలీస్ ఇన్ ఫార్మర్ గా పని చేస్తున్నాడని నేపంతో నిన్న రాత్రి గూడెంలో ప్రజా కోర్టు పెట్టి నరికి చంపారు.
Also Read : ‘మోదీ నో ఎంట్రీ టూ తెలంగాణ’… ప్రధానికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు
తెలంగాణ ప్రభుత్వం వచ్చాక యువతీ యువకులను డబ్బు ఆశ చూపిస్తూ పోలీస్ ఇన్ ఫార్మర్లుగా మార్చుతూ మావోయిస్టులపై దాడులకు పాల్పడుతున్నారని పద్ధతులు మార్చుకోవాలని అన్నారు. మావోయిస్టు పార్టీలో పని చేస్తూ పోలీస్ ఇన్ ఫార్మర్ గా పనిచేస్తున్న వారు ఇంకా ఎవరైనా ఉంటే వారు కూడా మారాలని పద్ధతి మార్చుకోకుంటే ప్రజల చేతిలో శిక్ష తప్పదని లేఖ లో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి :
- ప్రేమజంట ఆత్మహత్య….గతంలోనే యువతికి వివాహం
- మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఐటి, ఈడీ అదికారుల సోదాలు….
- కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై వేటుకు రంగం సిద్దం….పార్టీకి వెన్నుపోటు పొడిచారంటూ నేతల ఆరోపణ
- మునుగోడు రిజల్ట్ చూసి షేకైన కేసీఆర్.. బీజేపీ ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్?
- బిజేపి అభ్యర్డుల జాబితాలో క్రిక్కెటర్ జడేజా భార్య…..