
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఐటీ, ఈడీ సంయుక్తంగా సోదాలు నిర్వహిస్తోంది. కరీంనగర్, హైదరాబాద్ లో ఏకాలంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. గ్రానైట్ వ్యాపారి పాలకుర్తి శ్రీధర్ ఆఫీస్ లో ఈడీ సోదాలు చేస్తోంది. పంజాగుట్టలోని శ్రీధర్ ఆఫీస్ కు ఉదయమే చేరుకున్న ఈడీ, ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రాజేంద్రనగర్, హైదర్‌గూడలోని జనప్రియ అపార్ట్‌మెంట్‌లో ఐటి, ఈడీ సంయుక్తంగా సోదాలు నిర్వహిస్తోంది. నాలుగవ అంతస్తులో ఉన్న గ్రానైట్ వ్యాపారి శ్రీధర్ కార్యాలయంలో అధికారుల బృందం తనిఖీలు చేస్తోంది. అటు కరీంనగర్ లోనూ ఈడీ, ఐటీ అధికారులు సోదాలు చేస్తోన్నారు.
Also Read : కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై వేటుకు రంగం సిద్దం….పార్టీకి వెన్నుపోటు పొడిచారంటూ నేతల ఆరోపణ
కరీంనగర్‌లో గంగుల కమలాకర్ ఇంటితో పాటు మంకమ్మతోటలో ఆయనకు చెందిన శ్వేత గ్రానైట్, కమాన్ ప్రాంతంలోని మహవీర్, ఎస్వీఆర్ గ్రానైట్స్‌లో ఐటీ, ఈడీ తనిఖీలు చేస్తోంది. ఏకకాలంలో రెండు చోట్ల 30 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. గ్రానైట్ వ్యాపారి అరవింద్‌వ్యాస్‌తో పాటు మరికొంతమంది ఇళ్లు, కార్యాలయాల్లోనూ తనిఖీలు కొనసాగుతోన్నాయి. గ్రానైట్ రవాణా పన్ను ఎగవేసిన వ్యవహారంలో తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. గ్రానైట్ వ్యాపారులు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో గతంలోనే 8 ఏజెన్సీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. దాదాపు 20 మంది అధికారులు బృందాలుగా ఏర్పడి సోదాలు చేస్తున్నారు. కరీంనగర్ గ్రానైట్ అవకతవకలపై గతంలో సీబీఐ,ఈడీ కేసులు నమోదు చేశాయి.
ఇవి కూడా చదవండి :
- బిజేపి అభ్యర్డుల జాబితాలో క్రిక్కెటర్ జడేజా భార్య…..
- మునుగోడు రిజల్ట్ చూసి షేకైన కేసీఆర్.. బీజేపీ ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్?
- మర్రిగూడలో మాయమౌతున్న ప్రభుత్వ భూములు.. బై ఎలక్షన్ లో రెవెన్యూ నిర్లక్ష్యం…!
- ఓటర్లకు ఇవ్వాల్సిన కోట్లాది రూపాయలు స్వాహా! రాజన్నను ముంచేసిన మర్రిగూడెం బీజేపీ నేతలు!
- ఈడి, సిబిఐలు బిజెపి జేబు సంస్థలుగా మారాయి… రంగారెడ్డి టిఆర్‌ఎస్ నేతల ఆరోపణలు
One Comment