
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలను అధికార బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వరుసగా ఐదోసారి గెలిచి అధికారాన్ని నిలుపుకోవాలనే కృతనిశ్చయంతో ఉంది. డిసెంబరు 1, 5 తేదీల్లో రెండు విడతల్లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను బీజేపీ సిద్ధం చేసింది. ఈ జాబితాలో భారత క్రికెటర్ రవీందర్ జడేజా భార్య రివా సొలంకి పేరు కూడా ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
Read Also : కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై వేటుకు రంగం సిద్దం….పార్టీకి వెన్నుపోటు పొడిచారంటూ నేతల ఆరోపణ
బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ బుధవారం సమావేశమై.. జాబితాపై తుది నిర్ణయం తీసుకోనుంది. జడేజా భార్య రివా సోలంకి మెకానికల్ ఇంజనీర్ డిగ్రీ పూర్తిచేశారు. అంతేకాదు, కాంగ్రెస్ సీనియర్ నేత హరి సింగ్ సోలంకికి బంధువు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన హార్దిక్ పటేల్, అల్పేష్ ఠాకూర్ సహా పలువురు కొత్తవారికి అవకాశం ఇస్తారని, ఈసారి పెద్ద సంఖ్యలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కనబెడుతున్నారని వర్గాలు తెలిపాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలోని ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు సభ్యులుగా ఉన్న సెంట్రల్ కమిటీ సమావేశం తర్వాత జాబితాను ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.
Also Read : మునుగోడు రిజల్ట్ చూసి షేకైన కేసీఆర్.. బీజేపీ ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్?
గుజరాత్‌లో 28 ఏళ్ల నుంచి అధికారంలో కొనసాగుతున్న బీజేపీ.. ఈ ఎన్నికల్లో కొంతమంది సీనియర్లను పక్కనబెట్టాలని భావిస్తోంది. వీరిలో మాజీ సీఎం విజయ్ రూపానీ, మాజీ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ వంటి వారు ఉన్నారు. బీజేపీ 75 ఏళ్ల వయోపరిమితి నిబంధనలు అమలుచేస్తుండటంతో ఈ సీనియర్ నేతలకు చోటుదక్కే అవకాశం లేదు. డిసెంబరు 1, 5 తేదీల్లో పోలింగ్ నిర్వహించి, హిమాచల్ ప్రదేశ్‌తో కలిసి డిసెంబరు 8న ఫలితాలను వెల్లడించనున్నారు. ఇదిలా ఉండగా, ఢిల్లీలోని జేపీ నడ్డా నివాసంలో బీజేపీ కోర్ కమిటీ మంగళవారం సమావేశమయ్యింది. మూడు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం, అనుసరించాల్సిన విధానంపై చర్చించారు. అమిత్ షా, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్, కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయలు ఈ భేటీకి హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి :
- మర్రిగూడలో మాయమౌతున్న ప్రభుత్వ భూములు.. బై ఎలక్షన్ లో రెవెన్యూ నిర్లక్ష్యం…!
- ఓటర్లకు ఇవ్వాల్సిన కోట్లాది రూపాయలు స్వాహా! రాజన్నను ముంచేసిన మర్రిగూడెం బీజేపీ నేతలు!
- దేశ రాజకీయాల్లోకి గ్రాండ్ ఎంట్రీ.. 80 కోట్లతో చార్టెడ్ ఫ్లైట్ కొననున్న కేసీఆర్